BigTV English

Equador Wins Qatar loses In Fifa : ఫిఫాలో బోణికొట్టిన ఈక్వెడార్..బోల్తాపడ్డ ఖతార్..

Equador Wins Qatar loses In Fifa : ఫిఫాలో బోణికొట్టిన ఈక్వెడార్..బోల్తాపడ్డ ఖతార్..

Equador Wins Qatar loses In Fifa : ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఈక్వెడార్ బోణీ కొట్టింది. ఆతిథ్య జట్టు ఖతర్ పై విజయం సాధించింది. 2-0 తేడాతో గెలిచింది. విజయంతో ఈక్వెడార్ జట్టు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. నిజానికి 92 సంవత్సరాల ఫుట్ బాల్ ప్రపంచ కప్ చరిత్రలో ….ఇప్పటివరకు ఆతిథ్య జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్ లో ఓడిపోలేదు. విజయం సాధించడం లేదంటే డ్రాతో ముగించిన పరిస్థితి ఉండేది. కానీ ఆదివారం ఈ ఆనవాయితీ మారింది. టోర్నీ చరిత్రలో తొలిసారి ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్ లోనే… ఓటమి మూటకట్టుకుంది.


ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్లు వెచ్చించిన ఖతర్ దేశానికి తొలి మ్యాచే నిరాశను మిగిల్చింది. నాలుగోసారి ప్రపంచకప్ లో ఆడుతున్న ఈక్వెడార్ విజయంతో….. బోణీ కొట్టి శుభారంభం చేసింది. గ్రూప్ ఏ తొలి లీగ్ మ్యాచ్ లో ప్రపంచ 44వ ర్యాంకర్ ఈక్వెడార్…ప్రపంచ 50వ ర్యాంకర్ ఖతర్ ను ఓడించింది. ఈక్వాడార్ తరపున నమోదైన రెండు గోల్స్ ను ఇనెర్ వాలెన్సియా సాధించాడు


Tags

Related News

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

Big Stories

×