E-Paper
Advertisement

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు
Advertisement

Saudi Aramco headquarters: గల్ఫ్‌లో యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ కాస్త సైలెంట్ కావడంతో హౌతీలు రంగంలోకి దిగారు. గడిచిన రెండువారాలుగా సౌదీఅరేబియాపై డ్రోన్లు, మిస్సైళ్ల దాడులు చేస్తున్నాయి. దీంతో సౌదీ పాలకులకు వణుకు మొదలైంది. తాజాగా ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగ్గజం అరాంకో ప్రధాన కార్యాలయంపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు హూతీలు.

హౌతీల దాడులతో వణుకుతున్న సౌదీ అరేబియా

ఇరాన్ మద్దతుదారు యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు-సౌదీ అరేబియా మధ్య ఘర్షణ ప్రమాదకరమైన మలుపుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి తూర్పు సౌదీ నగరం ధహ్రాన్‌లో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద చమురు సంస్థ సౌదీ అరామ్కో భవనంపై బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగింది. ఈ దాడి తర్వాత భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇంధన మంత్రిత్వ శాఖ అధికారి చెప్పినట్లు సౌదీ ప్రభుత్వ వార్తా సంస్థ బుధవారం పేర్కొంది. క్షిపణి దాడి వల్ల కార్యాలయ భవనంపై మూడు అంతస్తులు దెబ్బతిన్నాయని స్థానిక పత్రికలు చెబుతున్నాయి.

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి

Advertisement

అరామ్కో కాంప్లెక్స్ కంపెనీకి ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీలలో ఒకటి అరామ్కో. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు ఒక కీలకమైనది. దీని నెట్‌వర్క్‌లో చమురు బావులు, పైప్‌లైన్‌లు, రిఫైనరీలు, ఎగుమతి టెర్మినళ్లు ఉన్నాయి. ధహ్రాన్ మీదుగా వచ్చిన ఓ క్షిపణి శకలాలు నివాస ప్రాంతంలో పడ్డాయని సౌదీ సంకీర్ణ దళాలు తెలిపాయి. నష్టం వివరాలను వెల్లడించలేదు. రియాద్‌లో దక్షిణ భాగంలోని క్షిపణులు, డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అధికారులు నివేదించారు.

అరామ్కో కంపెనీ ఆఫీసు డ్యామేజ్

అంతకుముందు మంగళవారం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. హౌతీలు చేస్తున్న దాడులకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. గతవారం నుండి హౌతీలు రాజధాని రియాద్‌లోని విమానాశ్రయంతోపాటు సౌదీ అరేబియాలోని కీలక లక్ష్యాలపై క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తున్నారు. శనివారం రియాద్ విమానాశ్రయంపై జరిగిన క్షిపణి దాడిలో 13 మంది మరణించారు. దశాబ్ద కాలంలో సౌదీ అరేబియాపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా నివేదికలు చెబుతున్నాయి. దాడుల వల్ల ఆ దేశ విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. సౌదీ అరేబియా ఓ ప్రధాన ఇంధన సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

Advertisement

ALSO READ: తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

హౌతీల దాడులను ఎదుర్కోవడానికి తన సైనిక పోరాటాన్ని కొనసాగించేందుకు సౌదీ అరేబియా తన మిత్రదేశాల నుండి మరింత మద్దతు కోరుతోంది. దీనిపై అమెరికా అంగీకరించలేదు. ఇదిలా ఉండగా సౌదీ అరేబియా-హౌతీ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఇరాన్ ముందుకొచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ ప్రతిపాదన చేశారు. టెహ్రాన్ చేసిన ప్రతిపాదన ప్రాంతీయ దౌత్యంలో ఒక కొత్త పరిణామం.

Related News

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

Big Stories

Advertisement
×