Solar Storm Alert 2026: సూర్యుని నుండి భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుఫాను వల్ల ఏం జరిగింది? భూమికి ఏమైనా ముప్పు పొంచి వుందా? దీని కారణంగా భూ కక్ష్యలోని ఉప గ్రహాలు, రేడియో కమ్యూనికేషన్లు, నేవిగేషన్ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడం ఎలా? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది.
సూర్యుడిలో కరోనల్ మాస్ ఎజెక్షన్ చర్యల వల్ల లక్షలాది టన్నుల కొద్దీ ప్లాస్మా-అయస్కాంత క్షేత్రాలు విడుదలవుతాయి. వాటిని సౌర తుపానుగా చెబుతారు శాస్త్రవేత్తలు. అవి సెకనుకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. భూమి అయస్కాంత క్షేత్రాన్ని బలంగా ఢీ కొట్టినప్పుడు తీవ్ర ఒత్తిడి, గందరగోళానికి లోనవుతుంది. ఫలితంగా భూఅయస్కాంత తుఫాను తలెత్తవచ్చు. ఈ పరిణామ తీవ్రత తక్కువ స్థాయి జీ1గా, జీ5ని ఎక్కువ స్థాయిగా చెబుతారు.
NOAA ప్రకారం.. అక్టోబర్ 7, 8న రెండు వేర్వేరు సౌర జ్వాలలు వెలువడ్డాయి. రెండో జ్వాల.. మొదటి దాని కంటే వేగంగా ప్రయాణిస్తూ భూమిని చేరే లోపే దాంతో విలీనమవుతుందని నిపుణుల అంచనా. రెండు జ్వాలలు కలిసి ఒకటి మారడం వల్ల ఆదివారం భూమిపై జీ2 తీవ్రతతో కూడిన భూ అయస్కాంత తుఫాను ఏర్పడే అవకాశముందన్నది అధికారులు తెలిపారు. సౌర తుఫాన్లకు అనుగుణంగా ఉపగ్రహ సంస్థలు తమ శాటిలైట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల రేడియో తరంగాల సంకేతాలు బలహీనపడడం, లేకుంటే నిలిచిపోవడం అవకాశం ఉంది.
జీపీఎస్ వంటి ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థల్లో తేడాలు రావొచ్చు. విమానాలు, నౌకాయానం, మొబైల్ సేవల జీపీఎస్ వ్యవస్థల్లో తీవ్ర సాంకేతిక లోపాలు లోపాలు తలెత్తే అవకాశముంది. ఎగువ అక్షాంశ ప్రాంతాలు ఉత్తర ధ్రువ దేశాల్లో పవర్ గ్రిడ్లలో వోల్టేజీ హెచ్చుతగ్గులు ఏర్పడి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. సూర్యుడి నుంచి వచ్చే రేణువులు.. భూఎగువ వాతావరణంలో వాయువులతో చర్య జరిపినప్పుడు ఆకాశంలో రంగు రంగుల అరోరాలు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి ధ్రువ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇతర ప్రదేశాలకు విస్తరించే అవకాశం ఉంది.
ALSO READ: నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ
దీని కారణంగా ఆకాశంలో అద్భుతమైన సహజ వింత ఆవిష్కృతం కానుంది. జరుగుతున్న పరిణామంపై ఖగోళ శాస్త్రవేత్తలు అనుక్షణం గమనిస్తూ, అధ్యయనం చేస్తున్నారు. భారతదేశానికి సంబంధించి రోజువారీ జీవితానికి పెద్ద ముప్పు ఏదీ లేదని ఓ అంచనా. G2 స్థాయి అంటే విస్తృతమైన విద్యుత్ కోతలు లేదా కమ్యూనికేషన్ వైఫల్యాలు అని అర్థం కాదని, దేశవ్యాప్తంగా అరోరాలు కనువిందు చేసే దృశ్యంగా మారవని అంటున్నారు.
Multiple solar storms have launched from the Sun over the last few days, and the first #spaceweather impacts have begun here at 1 AU as more waves of plasma are soon to arrive. NOAA expects minor to moderate (G1-G2) geomagnetic storming, and it's possible it goes higher… pic.twitter.com/tcZs8bCmZo
— Stefan Burns (@StefanBurnsGeo) October 9, 2026
🚨 The Sun just fired off a powerful M6.7 flare, blasting plasma into space and destabilizing a nearby filament. ☀️😳
And another solar storm is already heading our way, while effects from an earlier CME are expected today, Oct. 9.
The Sun is seriously active right now. pic.twitter.com/gVSQFUiUra
— Mindbeast (@mindbeast) October 9, 2026