E-Paper
Advertisement

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!
Advertisement

ఉత్తర కొరియా అంటే వెంటనే గుర్తొచ్చేది కిమ్ జంగ్ ఉన్. అతడి నిరంకుశ పాలన వల్ల అక్కడి ప్రజలకు భాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండా పోయింది. కిమ్ వారి బాగోగులు పట్టించుకున్నా, లేకపోయినా.. ఆ దేశ రక్షణ విషయంలో మాత్రం చాలా కచ్చితంగా ఉంటాడు. పొరుగు దేశాలతో వాళ్ల దేశానికి పెద్దగా ముప్పు లేకున్నా.. ఏదో రోజు పనికొస్తాయిలే అనే ఉద్దేశంతో రకరకాల ఆయుధాలను నిత్యం తయారు చేయిస్తూనే ఉంటాడు. అయితే, ఇప్పటివరకు వాటిని పూర్తి స్థాయిలో వాడుకొనే అవకాశం కిమ్ మామకు దక్కలేదు. అందుకే.. ఇంటర్నెట్‌లో కిమ్ ఒక మీమ్‌గా మారిపోయాడు. ఇంటి నిండా బొమ్మలున్నా.. ఆడుకోవడానికి మాత్రం ఎవరూ లేరనే మీమ్ బాగా పాపులర్ అయ్యింది. అయితే, ఇది కిమ్ వరకు చేరిందో ఏమో.. కాస్త సీరియస్‌గానే తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఆయుధాలతో తన బలాన్ని చూపించుకోవాలని అనుకున్నాడు. ఇందుకు తమ శత్రుదేశమైన దక్షిణ కొరియా అనుకోకుండా ఒక ఛాన్స్ ఇచ్చింది.

హైపర్సోనిక్ క్షిపణి సక్సెస్.. కిమ్‌ మామ గుర్రు

దక్షిణ కొరియా ఇటీవల తమ మొట్టమొదటి దేశీయ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే, ఉత్తర కొరియా దీటుగా స్పందిస్తూ.. తన తూర్పు తీరానికి సమీపంలోని సముద్రంలోకి వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా సోమవారం ఉదయం ఈ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. వీటిలో ఒక క్షిపణి సుమారు 900 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి తూర్పు సముద్రంలో పడినట్లు గుర్తించారు. ఈ క్షిపణులు గతంలో ప్రయోగించిన వాటికంటే భిన్నంగా ఉన్నాయని, గతంలో కంటే ఎక్కువ దూరం ప్రయాణించాయని అధికారులు తెలిపారు. అవి తప్పకుండా ఉత్తర కొరియాకు చెందిన హ్వాసంగ్-11 శ్రేణికి చెందిన అధునాతన లేదా అప్‌గ్రేడ్ చేసిన వేరియంట్లు అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

దక్షిణ కొరియా హైపర్సోనిక్ క్షిపణి ప్రత్యేకలు ఇవే

Advertisement

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ పర్యవేక్షణలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. దేశీయ తొలి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. శత్రువుల రాడార్ల కంట పడకుండా గంటకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈ క్షిపణి దూసుకెళ్తుంది. అంతేకాదు, మధ్యలో దిశ మార్చుకోగల సామర్థ్యం కూడా ఈ హైపర్సోనిక్ క్షిపణికి ఉంది. తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంలో భాగంగానే దక్షిణ కొరియా ఈ క్షిపణిని ప్రయోగించింది.

బాలిస్టిక్ క్షిపణులతో ఉత్తర కొరియా కౌంటర్

కొద్ది రోజుల క్రితమే కిమ్ జోంగ్ ఉన్ కూడా హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను నిర్వహించాడు. దక్షిణ కొరియా కూడా అదే చేయడాన్ని కిమ్ జీర్ణించుకోలేకపోయాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కిమ్.. తన సత్తా ఏమిటో పొరుగు దేశాలకు చూపించాలని అనుకున్నాడు. దక్షిణ కొరియా ఆయుధ సంపత్తిని పెంచుకోవడం తమ భద్రతకే సవాల్ అని భావించాడు. దానికి కౌంటర్‌గానే ఈ సరికొత్త బాలిస్టిక్ క్షిపణుల ప్రదర్శనకు దిగాడు.

Advertisement

Also Read: రూ. 50,000 ఉంటే చాలు.. రేపే ఈ వ్యాపారాలు స్టార్ట్ చేయెుచ్చు.. రూ.లక్షల్లో ఆదాయం!

కిమ్ దూకుడుపై ఆందోళన

ఉత్తర కొరియా దూకుడు చర్యలను దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ కవ్వింపు చర్యలు.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానాలను ఉల్లంఘిండచమేనని పేర్కొన్నాయి. ఉత్తర కొరియా నిరంతరం ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రాంతీయ శాంతికి ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు, కిమ్ జంగ్ ఉన్ ప్రభుత్వం.. అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా తన శత్రుపూరిత విధానాలను, ఆంక్షలను ఉపసంహరించుకునే వరకు తాము అణ్వాయుధ కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా మరోసారి స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకరినొకరు శాశ్వత శత్రువులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షిపణి ప్రయోగాలు ఎక్కడికి దారితీస్తాయో అనే ఆందోళన నెలకొంది.

Tags

Related News

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం సీరియస్!

Big Stories

Advertisement
×