E-Paper
Advertisement

Indian cricketers: 2025లో వివాహం, నిశ్చితార్థం చేసుకున్న క్రికెటర్లు వీళ్లే

Indian cricketers: 2025లో వివాహం, నిశ్చితార్థం చేసుకున్న క్రికెటర్లు వీళ్లే
Advertisement

Indian cricketers:  టీమిండియా క్రికెట‌ర్లు మెల్ల‌మెల్ల‌గా ఒక్కొక్క‌రూ ఓ ఇంటి వాళ్లు అవుతున్నారు. వీరిలో కొంద‌రూ మెన్స్, మ‌రికొంద‌రూ ఉమెన్స్ ఉన్నారు. కొంత మంది ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. మ‌రికొంద‌రూ గ‌త ఏడాది నిశ్చితార్థం చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఇంకొంద‌రూ ఈ ఏడాది నిశ్చితార్థం మాత్ర‌మే చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ ఏడాది నిశ్చితార్థం, వివాహం చేసుకున్న క్రికెట‌ర్ల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Also Read : INDW vs SLW 2nd T20I: రెచ్చిపోయిన‌ లేడీ సెహ్వాగ్‌..శ్రీలంక‌పై టీమిండియా మ‌రో విజ‌యం

Advertisement

2025లో వివాహం చేసుకున్న క్రికెటర్లు:

బీఆర్ శరత్ :

Advertisement

బేలూర్ రవి శరత్ దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడే భారతీయ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. కన్నడ నటి అర్చన కొట్టిగెను ఏప్రిల్ 23, 2025న బెంగళూరులో వివాహం చేసుకున్నారు.

లలిత్ యాదవ్ :

లలిత్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను 2017, నవంబరు 17న 2017–18 రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 2018, జనవరి 9న 2017–18 జోనల్ T20 లీగ్‌లో ఢిల్లీ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు. భారత క్రికెటర్ లలిత్ యాదవ్ ఫిబ్రవరి 9, 2025న వివాహం చేసుకున్నారు.

వెంకటేష్ అయ్యర్ :

వెంకటేశ్‌ అయ్యర్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం తరపున దేశవాళీ క్రికెట్‌లో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 2021 మార్చిలో లిస్ట్ -ఏ క్రికెట్ లో భాగంగా మధ్యప్రదేశ్, పంజాబ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో 146 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 198 పరుగులు చేసి లిస్ట్ -ఏ కెరీర్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న 197 పరుగుల రికార్డును చెరిపేశాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే ఆయన వివాహం జరిగింది.

డేవిడ్ బెడింగ్ హామ్ :

దక్షిణాఫ్రికా క్రికెటర్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ, 2025లోనే కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

Also Read : Messi: మెస్సీ ఇంట పెను ప్ర‌మాదం..పెళ్లి కూడా ర‌ద్దు ?
నిశ్చితార్థం చేసుకున్న వారు : 

కుల్దీప్ యాదవ్:

తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో జూన్ 4, 2025న నిశ్చితార్థం చేసుకున్నారు.

రింకూ సింగ్:

ఎంపీ ప్రియా సరోజ్‌తో జూన్ 8, 2025న నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం 2026 ఫిబ్రవరికి వాయిదా పడింది.

అర్జున్ టెండూల్కర్ :

సానియా చందోక్‌తో ఆగస్టు 13, 2025న నిశ్చితార్థం జరిగింది.

వైభవ్ అరోరా :

వేదిక అనే యువతితో డిసెంబర్ 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు.

స్మృతి మంధాన : 

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి నవంబర్ 2025లో జరగాల్సి ఉండగా.. ఆమె తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా పడి, తర్వాత డిసెంబర్ 2025లో రద్దు అయింది. దీనిపై ఇద్దరూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేశారు. పెళ్లి వాయిదా పడిన తర్వాత కూడా స్మృతి మంధాన క్రికెట్‌లో రాణిస్తూ, T20లలో 4000 పరుగుల మైలురాయిని దాటి రికార్డులు సృష్టిస్తూ వార్తల్లో నిలిచారు.

Also Read : LSG – South Africa : లక్నో జట్టుపై బ్యాన్? LSGని సీక్రెట్ గా దక్షిణాఫ్రికాకు పంపిస్తున్న ఓనర్ సంజీవ్…?

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×