BigTV English

Valencia Fire: అగ్ని‌కీలల్లో అపార్ట్‌మెంట్.. నలుగురు మృతి, 20 మంది గల్లంతు?

Valencia Fire: అగ్ని‌కీలల్లో అపార్ట్‌మెంట్.. నలుగురు మృతి, 20 మంది గల్లంతు?
International news in telugu

Fire engulfs 2 buildings in Spanish city of Valencia(International news in telugu): స్పెయిన్‌లో మూడో అతి పెద్ద నగరం వెలెన్సియాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 14 అంతస్తుల భవనం అగ్నికీలల్లో చిక్కుకోవడంతో నలుగురు ఆహుతయ్యారు. మరో 20 మంది ఆచూకీ తెలియడం లేదు. వారంతా మరణించినట్టుగా అనుమానిస్తున్నారు. మొత్తం 15 మంది గాయపడగా.. వారిలో ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.


ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 138 ఫ్లాట్లలో 450 మంది నివసిస్తున్నారు. ఉధృత గాలుల కారణంగా మంటలు పై అంతస్తులకు శరవేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. 10నిమిషాల వ్యవధిలోనే అగ్నికీలలు పై అంతస్తు వరకు చేరాయని అంటున్నారు.

అపార్ట్‌మెంట్ ముందు భాగంలో నిర్మాణానికి వాడిన పాలియురిథేన్ మెటీరియల్ జ్వాలలు వేగంగా వ్యాప్తి చెందడానికి ఓ కారణంగా తెలుస్తోంది. 2008-09 నాటి ఈ భవన నిర్మాణంలో మంటల వ్యాప్తికి దోహదపడే అలాంటి మెటీరియల్ వాడటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.


హీట్ ఇన్సులేషన్‌గా పాలియురిథేన్ మెటీరియల్ మంచిదే అయినా.. మండే స్వభావం దానికి అధికం. ఈ కారణంగానే ఇప్పుడు దీనిని భవన నిర్మాణాల్లో వినియోగించడం లేదు.

Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×