E-Paper
Advertisement

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?
Advertisement

Israel Elections: ఇజ్రాయెల్ లో కొలువు తీరేది ఎవరు? ఏ ఒక్క పార్టీకీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాలేదు. ప్రభుత్వం ఏర్పాటులో అరబ్ పార్టీలు కింగ్ మేకర్ రోల్ ప్లే చేసే అవకాశాలున్నాయి. అయితే అరబ్ పార్టీలను దూరం పెట్టాలని ప్రధాన పార్టీలు భావిస్తే బెంజమిన్ నెతన్యాహు-ఐసెన్ కోట్ పార్టీలు చేతులు కలపాలి. అది జరిగితే ఎనిమిదో వండరే అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఇదీ ఇజ్రాయెల్ లో నెలకొన్న సందిగ్ధత.

మొత్తం 120 స్థానాలు..

ఇజ్రాయెల్ పార్లమెంట్ ను కనెసెట్ అంటారు. అందులో మొత్తం 120 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 61 స్థానాలు అవసరం. ప్రస్తుత ప్రదాని బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ 27 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. మిత్ర పక్షాలతో కలిసి నెతన్యాహు కూటమికి 53 స్థానాలు వచ్చాయి.ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 8 స్థానాలు కావాలి. బెంజమిన్ ను గద్దె దించుతానని ఛాలెంజ్ చేసిన ఐసెన్ కోట్ కు చెందిన యషార్ పార్టీ 21 స్థానాలు గెలుచుకుంది. దాని మిత్ర పక్షాలతో కలిసి కూటమికి 48 స్థానాలు వచ్చాయి. మూడు అరబ్ పార్టీలకు కలిపి 19 స్థానాలు దక్కాయి. ఎవ్వరూ నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.

అధికారంలోకి రావాలంటే..

Advertisement

నెతన్యాహు మళ్లీ అధికారంలోకి రావాలంటే అరబ్ పార్టీల మద్దతు తీసుకోవాలి. అది జరిగేది కాదు. ఎందుకంటే అరబ్ పార్టీలతో ఎవరూ జట్టు కట్టద్దదని నెతన్యాహు పదే పదే పిలుపునిస్తూ వచ్చారు.ఎన్నికల్లో అరబ్ పార్టీలు అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. అటువంటి అరబ్బులతో నెతన్యాహు కలవలేరు. పోనీ నెతన్యాహు-ఐసెన్ కోట్ లు ఇద్దరూ చేతులు కలిపితే ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయచ్చు. కానీ అది కూడా సాధ్యం కాదు.ఎందుకంటే నెతన్యాహును గద్దె దించడమే తన లక్ష్యమని ఐసెన్ కోట్ ప్రచారం చేశారు. ఆ కారణంగానే అతి వాద యూదు పార్టీలు ఐసెన్ కోట్ తో పొత్తు పెట్టుకున్నాయి. అరబ్ పార్టీలంటే కరడు గట్టిన యూదు భావజాలపు పార్టీలకు అసలు గిట్టదు. కాకపోతే అరబ్ పార్టీలు మాత్రం ఐసెన్ కోట్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఆపద్ధర్మ ప్రధానిగా..

సంక్లిష్ట సమీకరణల నేపథ్యంలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోతే దేశాధ్యక్షుడు మరోసారి ఎన్నికలకు ఆదేశించే అవకాశాలున్నాయి. ఆ ఎన్నికలకు ఏడాది సమయం పట్టచ్చు. అప్పటి వరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటారు.సో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడం కూడా నెతన్యాహుకు జాక్ పాటే.

Advertisement

Also read: మామగారి రహస్య వ్యవహారం బయటపెట్టే కాబోయే కోడలు… దీపావళి రోజున అసలైన ధమాకా

Tags

Related News

ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఖతార్, టర్కీల సీక్రెట్ గేమ్ నిజమేనా? షిన్ బెట్ విచారణలో తేలేది ఏంటి?

అమెరికా అణు కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఎమర్జెనీ విధింపు, ఘటన ఎలా జరిగింది?

మార్కెట్‌పై డ్రోన్లతో దాడి.. ఏకంగా 100 మంది మృతి, సుడాన్‌లో ఘోరం

లండన్ బుక్ స్టోర్స్ లో ఆ పుస్తకాలు ఏమయ్యాయి? సాలీ రూణీ వివాదం వెనుక అసలు నిజం!

ఆస్ట్రేలియా వీసా కావాలా? భారతీయులకు నేటి నుంచి రూల్స్, ఆ రెండు చేయాల్సిందే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త హెచ్చరిక.. ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తాం, ఈ రోజు నుంచే మొదలు

మాల్దీవులు-పాకిస్తాన్ దోస్తీ.. భారత్‌పై దీని ప్రభావం ఎంత?

Big Stories

Advertisement
×