E-Paper
Advertisement

పుట్‌బాల్ గేమ్ తర్వాత.. స్టేడియంలో కాల్పులు కలకలం, అమెరికాలో షాకింగ్ ఘటన

పుట్‌బాల్ గేమ్ తర్వాత.. స్టేడియంలో కాల్పులు కలకలం, అమెరికాలో షాకింగ్ ఘటన
Advertisement

America: అమెరికాలోని ఫుల్‌బాల్ గేమ్ తర్వాత స్టేడియంలో దారుణం చోటు చేసుకుంది. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా, అనేక మంది గాయపడ్డారు. లీజియన్ ఫీల్డ్ ఫుట్‌బాల్ స్టేడియంలో కాల్పులు జరిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు, బాధితులను ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలోని ప్రధాన సిటీల్లో ఫుల్‌బాల్ మ్యాచ్ తర్వాత అనేక హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఆ తరహా ఘటనలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో లీజియన్ ఫీల్డ్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని బర్మింగ్‌హామ్ పోలీసులు వెల్లడించారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. మ్యాజిక్ సిటీ క్లాసిక్ ఫుట్‌బాల్ గేమ్ జరిగిన రాత్రి7.50 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పుట్‌బాల్ గేమ్ తర్వాత స్టేడియంలో కాల్పులు

Advertisement

గాయపడిన వారి సంఖ్యను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అమెరికాలోని అతి పెద్ద చారిత్రాత్మక బ్లాక్ కాలేజీ- యూనివర్సిటీ HBCU మధ్య ఫుట్‌బాల్ గేమ్ ముగిసిన కొద్దిసేపటికే ఈ కాల్పులు జరిగాయి. వార్షిక మ్యాచ్‌ను అలబామా విశ్వవిద్యాలయం – అలబామా స్టేట్ విశ్వవిద్యాలయం మధ్య ఆడతారు. కాల్పుల ఘటన అనంతరం అధికారులు అన్ని టెయిల్‌ గేటింగ్ కార్యకలాపాలను నిలిపి వేశారు. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ప్రజలను ఆదేశించారు.

దయచేసి ఇలాంటి సమయంలో లీజియన్ ఫీల్డ్ స్టేడియం ప్రాంగణానికి రావద్దని, బర్మింగ్‌హామ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాజా సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. బర్మింగ్‌హామ్ ఫైర్- రెస్క్యూకు చెందిన పారామెడికల్, అత్యవసర సిబ్బంది, ఫుట్‌పాత్‌పై పడి ఉన్న బాధితులకు ప్రథమ చికిత్స అందించడానికి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డిటెక్టివ్‌లు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు లీజియన్ ఫీల్డ్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మూసి వేశారు.

Advertisement

ALSO READ: జెన్-జీ నిరసనలు తీవ్రతరం.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో షాపుల లూటీ, జర్మనీలో హింసాత్మక పరిస్థితులు

ప్రజలు స్టేడియం సమీప ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండాలని వారు కోరారు. ఈ కేసును విచారిస్తున్న అధికారులు, పెట్రోలింగ్ బృందాలతో కలిసి కాల్పులు జరిపిన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ప్రత్యక్ష సాక్షులు చిత్రీకరించిన ఏవైనా వీడియో ఫుటేజీలను అందించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.

 

Related News

జెన్-జీ నిరసనలు తీవ్రతరం.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో షాపుల లూటీ, జర్మనీలో హింసాత్మక పరిస్థితులు

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?

ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఖతార్, టర్కీల సీక్రెట్ గేమ్ నిజమేనా? షిన్ బెట్ విచారణలో తేలేది ఏంటి?

అమెరికా అణు కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఎమర్జెనీ విధింపు, ఘటన ఎలా జరిగింది?

మార్కెట్‌పై డ్రోన్లతో దాడి.. ఏకంగా 100 మంది మృతి, సుడాన్‌లో ఘోరం

లండన్ బుక్ స్టోర్స్ లో ఆ పుస్తకాలు ఏమయ్యాయి? సాలీ రూణీ వివాదం వెనుక అసలు నిజం!

ఆస్ట్రేలియా వీసా కావాలా? భారతీయులకు నేటి నుంచి రూల్స్, ఆ రెండు చేయాల్సిందే

Big Stories

Advertisement
×