E-Paper
Advertisement

జెన్-జీ నిరసనలు తీవ్రతరం.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో షాపుల లూటీ, జర్మనీలో హింసాత్మక పరిస్థితులు

జెన్-జీ  నిరసనలు తీవ్రతరం.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో షాపుల లూటీ, జర్మనీలో హింసాత్మక పరిస్థితులు
Advertisement

Germany: యూరప్‌ని జెన్ జీ నిరసనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిన్న ఫ్రాన్స్ కాగా, నేడు జర్మనీ వంతైంది. నిరసనలు మెల్లగా యూరప్ అంతా వ్యాప్తించడంతో పలు దేశాల నేతలు టెన్షన్ వెంటాడుతోంది. వీటిని ఎలా కంట్రోల్ చేయాలంటూ కంగారు పడుతున్నారు. నిరసనల పేరుతో షాపులు లూఠీలు కొనసాగుతున్నాయి.

యూరప్ అంతా వ్యాపించిన జెన్ జెడ్ నిరసనలు

జర్మనీలో జెన్ జెడ్ నిరసనలు తీవ్రమయ్యాయి. ఓ వైపు ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అదే సమయంలో మరికొందరు షాపుల లూఠీలకు పాల్పడుతున్నారు. దీంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి పోలీసులకు ఎదురైంది. అంతేకాదు పోలీసులపై పెట్రోల్ బాంబులు విరుతుండడంతో అక్కడ పరిస్థితులు జఠిలమవుతున్నాయి.

Advertisement

ఎడ్యుకేషన్ వ్యవస్థకు నిధులు, పెరుగుతున్న జీవన వ్యయాలు, ప్రజా సేవల అంతంత మాత్రమే ఉండడం, తప్పనిసరి సైనిక సేవకు వ్యతిరేకంగా జర్మనీలోని ప్రధాన నగరాల్లోకి పదివేల మంది ప్రజలు తరలివస్తున్నారు. శనివారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్‌ సిటీలో ముసుగులు ధరించిన నిరసనకారులు షాపులను లూఠీ చేశారు. జెన్ జెడ్ రెగెల్ట్ పేరుతో జర్మనీలోని అనేక నగరాల్లో నిరసనలు జరిగాయి.

నిన్న ఫ్రాన్స్.. నేడు జర్మనీ.. ఖరీదైన షాపులు లూఠీలు

బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ సహా 34 నగరాల్లో ఈ ప్రదర్శనలు తీవ్రమయ్యాయి. యువత ఆర్థిక భద్రతను, మెరుగైన ప్రజా సేవలను డిమాండ్ చేస్తూ ఐరోపా వ్యాప్తంగా యువత నేతృత్వంలో జరుగుతున్న ఈ నిరసనలు భాగమయ్యాయి. ఫ్రాంక్‌ఫర్ట్ సిటీలో ఒక్కసారి పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో ఆందోళనకారులు ఖరీదైన షాపులను దోపిడీ చేయడం, పోలీసులపై దాడులతో విరుచుకుపడ్డారు. అయితే వారంతా ముఖాలకు ముసుగు వేసుకుని కనిపించారు. చివరకు ఆయుధాల షాపులపై దాడికి యత్నించారు.

Advertisement

ఈ క్రమంలో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, సీసాలు, మోలోటోవ్ కాక్‌ టెయిల్స్ విసరడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన పోలీసులు, షాపింగ్ వీధులను మూసివేశారు. నగరాన్ని ఖాళీ చేయాలని నిరసనకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ALSO READ: ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?

హాంబర్గ్‌లో కొన్ని బారికేడ్లకు నిప్పు పెట్టారు. నిరసనల ప్రదర్శనలు శాంతియుతంగానే జరిగాయని జర్మన్ అధికారులు చెబుతున్నారు. కాకపోతే తీవ్రవాద గ్రూపులు ఈ సమావేశాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో జర్మనీ ఒకటి. మనం బలప్రయోగం కోసం కాకుండా శాంతి, స్వేచ్ఛ కోసం పోరాడటానికి ఇక్కడ ఉన్నామని బెర్లిన్‌లో జరిగిన ర్యాలీలో జెన్ జెడ్ రెగెల్ట్ ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్ అన్నారు. ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు మద్దతు అందించడమే ముఖ్యమన్నారు. మేము నిర్బంధ సైనిక సేవకు వ్యతిరేకం, భారాన్ని మరింత న్యాయబద్ధంగా పంపిణీ చేయడానికి అనుకూలంగా ఉన్నామని అన్నారు.

 

Related News

పుట్‌బాల్ గేమ్ తర్వాత.. స్టేడియంలో కాల్పులు కలకలం, అమెరికాలో షాకింగ్ ఘటన

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?

ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఖతార్, టర్కీల సీక్రెట్ గేమ్ నిజమేనా? షిన్ బెట్ విచారణలో తేలేది ఏంటి?

అమెరికా అణు కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఎమర్జెనీ విధింపు, ఘటన ఎలా జరిగింది?

మార్కెట్‌పై డ్రోన్లతో దాడి.. ఏకంగా 100 మంది మృతి, సుడాన్‌లో ఘోరం

లండన్ బుక్ స్టోర్స్ లో ఆ పుస్తకాలు ఏమయ్యాయి? సాలీ రూణీ వివాదం వెనుక అసలు నిజం!

ఆస్ట్రేలియా వీసా కావాలా? భారతీయులకు నేటి నుంచి రూల్స్, ఆ రెండు చేయాల్సిందే

Big Stories

Advertisement
×