E-Paper
Advertisement

China Bridge Collapse: హైవేపై వెళ్తుండగా సడెన్‌గా కూలిన బ్రిడ్జి.. 11 మంది మృతి

China Bridge Collapse: హైవేపై వెళ్తుండగా సడెన్‌గా కూలిన బ్రిడ్జి.. 11 మంది మృతి
Advertisement

China Bridge Collapse Kills 11 People: ప్రయాణిస్తున్న సమయంలో సెడెన్‌గా బ్రిడ్జి కూలింది. ఈ ప్రమాదం బారిన పడి 11 మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. గత కొద్ది రోజుల నుంచి చైనాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు, నదులు భారీగా పొంగిపొర్లుతున్నాయి. షాంగ్లూ నగరంలోని ఝూషుయ్ కౌంటీలోని రహదారిపై ఉన్న బ్రిడ్జి వరదల కారణంగా కూలిపోయింది. దీంతో ఆ సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 11 మంది ప్రయాణికులు మృతిచెందారని, పలువురికి గాయాలయ్యాయని, మరికొంతమంది గల్లంతయ్యారని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు తెలిపారు.

Also Read: అత్యధిక ఎక్స్ ఫాలోవర్స్ కలిగిన నాయకుడు మోదీ.. భారత ప్రధానికి శుభాకంక్షలు తెలిపిన మస్క్

Advertisement

నదిలో గల్లంతైన వారి ఆచూకీ కోసం 736 మంది రెస్క్యూ సిబ్బంది, 76 వాహనాలు, 18 బోట్స్, 32 డ్రోన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. నదిలో పడిన 5 వాహనాలను రెస్క్యూ బృందాలు గుర్తించి, బయటకు తీశాయని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. ఈ ప్రమాదం పట్ల ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో వరద నియంత్రణ సమస్యాత్మకంగా మారినట్లు ఆయన తెలిపారు. అయితే, స్థానిక ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకుని, అన్నింటినీ మానిటర్ చేయాలంటూ సూచించారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×