BigTV English

Jawan: పాకిస్తాన్ బార్డర్‌లో ఇద్దరు భారత సైనికులు మరణం.. కాల్పుల వల్ల కాదు..

Jawan: పాకిస్తాన్ బార్డర్‌లో ఇద్దరు భారత సైనికులు మరణం.. కాల్పుల వల్ల కాదు..

BSF: పాకిస్తాన్, భారత్ మధ్య సరిహద్దులో ఆ సైనికులు పెట్రోలింగ్‌కు బయల్దేరారు. గుజరాత్ వెంట ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఆయన గస్తీ కాయడానికి వెళ్లారు. కానీ, ఆ సైనికులు తిరిగి పెట్రోలింగ్ బేస్ స్టేషన్‌కు రాలేదు. దారి మధ్యలోనే మరణించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్పులో.. మోర్టార్ షెల్లింగ్ వల్లనో మరణించలేదు. తీవ్రమైన ఎండలో పహారా కాస్తున్న సదరు సైనికులకు ఎండ దెబ్బ తాకింది. సమయానికి వెంట తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోవడం, ఎనర్జీ ఫ్లూడ్స్ కూడా ఏమీ లేకపోవడంతో బార్డర్ ఫోర్స్ ఆఫీసర్, జవాను ప్రాణాలు కోల్పోయాడు.


హరామీ నల్లా కొండ ప్రాంతలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఆఫీసర్, జవాన్‌ పహారాకు వెళ్లారు. అసిస్టెంట్ కమాండంట్ విశ్వ దేవ్, హెడ్ కానిస్టేబుల్ దయాల్ రామ్‌లు 34 నుంచి 36 డిగ్రీల ఎండలో పహారా కాస్తుండగానే ఎండ దెబ్బకు గురయ్యారు. శుక్రవారం సరిహద్దు ప్రాంతంలోనే వీరిద్దరూ మరణించారు. ప్రస్తుతం రన్ ఆఫ్ కచ్, హరామీ నల్లా ఏరియాలో 34 నుంచి 36 డిగ్రీల ఎండకాస్తున్నట్టు సమాచారం. ఇక్కడ తేమ శాతం 80 నుంచి 82 శాతంగా ఉన్నది.

Also Read: కేసీఆర్ తనకు తానే ఆర్కిటెక్ట్ అనుకుని కట్టిన ప్రాజెక్ట్ ఇదీ.. అందుకే ఇంత నష్టం


దేవ్ 59వ బెటాలియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఆఫీసర్. పెట్రోల్ టీమ్ వద్ద నీరు, ఎనర్జీ ఫ్లూడ్స్ అయిపోయయి. అయితే, సమీప బేస్ నుంచి టీమ్ నీటిని తీసుకువచ్చిందని వారు చెప్పారు. సాయంత్రానికల్లా భుజ్‌లోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లినా.. వారిద్దరిని కాపాడుకోలేకపోయారని తెలిసింది.

మే నెలలో కూడా ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో రాజస్తాన్‌‌కు చెందిన జైసల్మేర్ ఏరియాలో ఎండదెబ్బ తగిలి మరణించాడు. వర్షాకాలంలోనూ సరిహద్దు ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఎండలు కాస్తున్నాయి. సరిహద్దు వెంట పహారా కాస్తున్న జవాన్లు కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇక శీతాకాలంలోనూ ముఖ్యంగా కశ్మీర్ వైపున పహారా కాసే జవాన్లు గడ్డకట్టే చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కఠోర శీతోష్ణ స్థితులను సైనికులు తమ విధి నిర్వహణలో భాగంగా రెగ్యులర్‌గా ఎదుర్కొంటూనే ఉంటారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×