E-Paper
Advertisement

నా బూట్లు నీతో కడిగిస్తాను.. సెక్యూరిటీ గార్డుపై ఓ మహిళ చిందులు, గ్రేటర్ నొయిడాలో ఘటన, వీడియో వైరల్

నా బూట్లు నీతో కడిగిస్తాను.. సెక్యూరిటీ గార్డుపై ఓ మహిళ చిందులు, గ్రేటర్ నొయిడాలో ఘటన, వీడియో వైరల్
Advertisement

Greater Noida: బడాబాబులకు కేరాఫ్ గ్రేటర్ నొయిడా ప్రాంతం. ఆ ప్రాంతాల్లో మంచి మాత్రమే కాదు.. అప్పుడప్పుడు చెడు కూడా కనిపిస్తుంది. డెలివరీ బాయ్‌ని ఆపినందుకు ఆగ్రహానికి వ్యక్తం చేసింది ఓ మహిళ. ఆ తర్వాత ఆ సెక్యూరిటీ గార్డుపై తనదైన శైలిలో విరుచుకుపడింది. చుట్టూ వ్యక్తులు ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయింది సదరు మహిళ. నా బూట్లు.. నీతో కడిగిస్తానంటూ శివాలెత్తింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలు ఏం జరిగింది.

 

గ్రేటర్ నొయిడాలోని హౌసింగ్ సొసైటీ ఘటన

Advertisement

గ్రేటర్ నోయిడాలోని అమ్రపాలి సెంచూరియన్ పార్క్ టెర్రేస్ హోమ్స్‌ లో సొసైటీ గేటు వద్ద హైఓల్టేజీ డ్రామా వెలుగులోకి వచ్చింది. ఆహారం తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌ని సెక్యూరిటీ గార్డ్ ఆపాడు. వెంటనే డెలివరీ బాయ్.. సదరు కస్టమర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే లోపల నుంచి ఓ మహిళ సెక్యూరిటీ గార్డు వద్దకు వచ్చింది.

సెక్యూరిటీ గార్డుని చూడగానే ఒక్కసారిగా సదరు మహిళ శివాలెత్తింది. ఆమెలోని ఉగ్రరూపం అంతా బయటపడింది. చుట్టూ వ్యక్తులు ఉన్నారు, సెక్యూరిటీతో గొడవకు దిగడం సరిగా ఉండదని భావించలేదు. ఆగ్రహాన్ని కోల్పోయిన ఏకంగా సెక్యూరిటీ కాలు ఎత్తింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement

 

సెక్యూరిటీ గార్డుపై శివాలెత్తిన సదరు మహిళ

గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీలో ఓ మహిళకు సంబంధించిన హై-వోల్టేజ్ డ్రామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్రపాలి సెంచూరియన్ పార్క్ టెర్రేస్ హోమ్స్ సొసైటీలో ఓ ఘటన జరిగింది. రాత్రి ఓ మహిళ ఆన్‌లైన్‌లో శానిటరీ ప్యాడ్‌లు, ఆహార పదార్థాలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. డెలివరీ బాయ్ సరుకులతో సొసైటీకి వచ్చాడు. సెక్యూరిటీ గార్డు అతడ్ని తనిఖీ కోసం ఆపాడు.

వెంటనే సదరు బాయ్.. మహిళకు ఫోన్ చేసి జరిగిన దంతా చెప్పాడు. తన ఫ్లాట్ నుంచి బయటకు వచ్చిన ఆ మహిళ ఒక్కసారిగా శివాలెత్తింది. సెక్యూరిటీ గార్డులతో ఆమె వాగ్వాదానికి దిగింది. వివాదం తీవ్రం కావడంతో గార్డుతో మహళ దురుసుగా ప్రవర్తించింది. తన కోపాన్ని నియంత్రించుకోలేక మహిళ, సెక్యూరిటీపైకి ఎడమకాలు లేపింది.  కుల దూషణలకు దిగినట్టు వార్తలు వస్తున్నాయి.

ALSO READ: సింగర్ అంకిత్ దారుణ హత్య.. జిమ్ నుంచి బయటకు వస్తుండగా 20 రౌండ్లు కాల్పులు

మరో గార్డును చెంప దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. అక్కడే ఉన్న ఇతర సెక్యూరిటీ గార్డులు ఆ మహిళ వీరంగం కళ్లతో చూశారు. అక్కడేవున్న ఓ వ్యక్తి, ఈ తతంగాన్ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో సదరు మహిళ సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదం చేస్తూ దూషిస్తున్నట్లు కనిపిస్తుంది. నా ముందు నీకు స్థానం లేదు.. నా బూట్లు నీతో కడిగిస్తానని అన్నట్లు స్పష్టంగా వినిపించింది. వీడియో బయటపడిన తర్వాత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి.

 

 

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×