BigTV English

Turkey Propane Tank Blast: టర్కీలో భారీ పేలుడు, ఐదుగురు మృతి, 60 మందికిపైగా..

Turkey Propane Tank Blast: టర్కీలో భారీ పేలుడు, ఐదుగురు మృతి, 60 మందికిపైగా..

Propane tank blast in turkey(Latest international news today): టర్కీలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 63 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈ ఘటన పశ్చిమ టర్కీలోని ఇజ్మీర్ సిటీలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు సంబం ధించిన ట్యాంకులో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పేలుడు ధాటికి రెస్టారెంట్ సమీపంలోని భవనాలు బాగానే డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది.

పేలుడు జరిగిన ప్రాంతంలోని రోడ్డు మీదుగా వెళ్తున్న పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే టర్కీ అధికారులు స్పందించారు. వెంటనే రెస్క్యూటీమ్ లను అక్కడికి పంపారు. మరోవైపు ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న బాధితులను ఇజ్మీర్ గవర్నర్ పరామర్శించారు. అయితే స్వల్పంగా గాయపడిన వారిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.


ALSO READ: భూమికి దగ్గరగా రెండు గ్రహ శకలాలు, అంతా సేఫ్

ఈ పేలుడు వెనుక ఎవరున్నారనే దానిపై టర్కీ ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. ప్రమాదవశాత్తూ ఘటన జరిగిందా? లేదా అనేదానిపై విచారణలో తెలియాల్సివుంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×