BigTV English

Girlfriend Killer | గర్ల్‌ఫ్రెండ్‌ని రేప్ చేసి పొడిచి పొడిచి చంపాడు.. జైలు నుంచి ఈజీగా బయటికొచ్చాడు!

Girlfriend Killer | ఆ యువతి కొన్నేళ్లపాటు ఒక యువకుడిని ప్రేమించింది. ఆ తరువాత అతనితో బ్రేకప్ చేసుకుంది. కానీ యువకుడు ఆమెను వదల్లేదు. ఆమెను ఒకరోజు కిడ్నాప్ చేసి.. ఒక అపార్ట్‌మెంట్‌లో తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశాడు. ఆమెను బంధించి మూడున్నర గంటలపాటు కత్తితో 111 సార్లు పొడిచాడు

Girlfriend Killer | గర్ల్‌ఫ్రెండ్‌ని రేప్ చేసి పొడిచి పొడిచి చంపాడు.. జైలు నుంచి ఈజీగా బయటికొచ్చాడు!

Girlfriend Killer | ఆ యువతి కొన్నేళ్లపాటు ఒక యువకుడిని ప్రేమించింది. ఆ తరువాత అతనితో బ్రేకప్ చేసుకుంది. కానీ యువకుడు ఆమెను వదల్లేదు. ఆమెను ఒకరోజు కిడ్నాప్ చేసి.. ఒక అపార్ట్‌మెంట్‌లో తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశాడు. ఆమెను బంధించి మూడున్నర గంటలపాటు కత్తితో 111 సార్లు పొడిచాడు. ఆ సమయంలో ఆమె గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విని పొరుగింటివారు పోలీసులకు ఫోన్ చేశారు. కానీ పోలీసులు చాలా అలస్యంగా వచ్చారు.


పోలీసులు వచ్చేసరికి ఆ యువకుడు ఆమె గొంతుకు ఒక ఇనుప తీగ చూట్టి చంపుతున్నాడు. పోలీసులు ఆమెను ఆస్పత్రి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయింది. కోర్టులో ఆ యువకుడికి 17 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కానీ యువకుడి అదృష్టం అతనికి రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష లభించింది. అతను రెండేళ్ల తరువాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ ఘటన రషియా దేశంలో జరిగింది. ఇప్పుడా చనిపోయిన యువతి తల్లిదండ్రులు ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ యువకుడిని ఎందుకు విడుదల చేశారంటే..

రషియా దేశానికి చెందిన వ్లాడిశ్లావ్ కాన్యూస్(24) 2020 సంవత్సరంలో తన గర్ల్‌ఫ్రెండ్ వెరా పెఖ్తేలెవా(23)ను అతి దారుణంగా హత్యచేశాడు. ఈ నేరం చేసినందుకు కోర్టు అతనికి 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఆరు నెలల క్రితం వ్లాడిశ్లావ్ జైలు నుంచి విడుదలయ్యాడని వెరా తల్లిదండ్రులకు తెలిసింది. ఇదెలా జరిగిందంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


నిజానికి రషియా గత 20 నెలలుగా పొరుగు దేశం ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధంలో రషియా తరపున పోరాడడానికి యువకులు అవసరం. దీంతో రషియా అధ్యక్షుడు పుతిన్ జైలు ఖైదీలను ఆ యుద్ధంలో రషియా సైనికులుగా పోరాడేందకు వెళ్లాలని ఆదేశించారు. అలా యుద్ధంలో పోరాడే ఖైదీలకు శిక్ష రద్దు చేస్తామని రషియా ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో హంతకుడు వ్లాడిశ్లావ్ కాన్యూస్ యుద్ధానికి వెళేందుకు అంగీకరించాడు. అలా అతను యుద్ధంలో పోరాడుతున్న ఫోటీలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి.

ఆ వైరల్ అయిన వార్త చనిపోయిన వెరా పెఖ్తేలెవా కటుంబానికి చేరింది. దీంతో ఆమె తల్లి ఓక్సానా పెఖ్తేలెవా మీడియా ముందుకు వచ్చి తమకు అన్యాయం జరిగిందని కన్నీరు పెట్టుకుంది. తన కూతురిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ పరిస్థితి ఆమె ఒక్కరికే రాలేదు. చాలా మంది జైలు ఖైదీలు యుద్ధంలో దేశం తరపున పోరాడుతున్నారు. అలా చేయడం అన్యాయమని మానవ హక్కుల కార్యకర్తలు పుతిన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ.. జైలు ఖైదీలు తాము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగానే యుద్ధం రంగంలో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నారని చెప్పారు.

కానీ తన కూతురి హంతకుడికి ప్రభుత్వమే తుపాకీ ఇచ్చింది. మరి అతను తమపై దాడి చేస్తాడేమోనని భయంగా ఉంది అని పెఖ్తేలెవా తల్లి చెప్పింది.

Related News

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Big Stories

×