BigTV English

Global Defense Spending 9%: పెరిగిన ప్రపంచ రక్షణ వ్యయం..

Global Defense Spending 9%:  పెరిగిన ప్రపంచ రక్షణ వ్యయం..

World Wide Defense Spending Increased to 9 Percent: ప్రపంచవ్యాప్తంగా రక్షణావసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయం గణనీయంగా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాదిలోనే ఆ వ్యయం 9 శాతం పెరిగింది. మందుగుండు సామగ్రి నుంచి అణ్వాయుధాల వరకు 2022లో 1.7 ట్రిలియన్ డాలర్లు వ్యయం కాగా.. నిరుడు అది 2.2 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. 2024లో రక్షణ ఖర్చు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.


ఉక్రెయిన్‌పై యుద్ధం ఆరంభించిన రష్యా సాయుధ బలగాల కోసం బడ్జెట్‌లో
చేసిన కేటాయింపులు 30 శాతం దాటేశాయని ప్రపంచ సైనిక వ్యయాన్ని మదింపు చేసే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రేటజిక్ స్టడీస్(IISS) మంగళవారం వెల్లడించింది. యుద్ధంలో రష్యా సైన్యం 3 వేలకు పైగా ప్రధాన యుద్ధ ట్యాంక్‌లను కోల్పోయింది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై దండెత్తడానికి ముందు మోహరించిన యుద్ధ ట్యాంక్‌లకు ఇవి దాదాపు సమానం. ప్రస్తుతం ఆ లోటును భర్తీ చేసే పనిలో ఉంది.

అమెరికా, యూరప్ దేశాలు మిస్సైళ్లు, మందుగుండు సామగ్రి ఉత్పత్తిని ముమ్మరం చేయడంపై తిరిగి దృష్టి సారించాయని ఐఐఎస్ఎస్ పేర్కొంది. ప్రచ్ఛన్నయుద్ధం నంతరం ఆయా దేశాలు ఆయుధ నిల్వలపై కొంతకాలం నిర్లక్ష్యం వహించాయని ఆ సంస్థ వివరించింది. చైనా, రష్యా సహా పలు దేశాలు హైపర్ సానిక్ మిస్సైల్ వంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని పెంపొందించడంపైనా దృష్టి సారిస్తున్నాయని గుర్తు చేసింది.


ధ్వని వేగం కన్నా ఐదు రెట్ల వేగంతో దూసుకుపోగల సామర్థ్యం హైపర్ సానిక్ మిస్సైళ్ల సొంతం. వీటిని ఇంటర్‌సెప్ట్ చేయడం అత్యంత దుర్లభం. అలాగే సిబ్బంది రహిత అటాక్ బోట్ల వంటి అన్ మ్యాన్డ్ వెపన్స్ తయారీలోనూ ఎంతో పురోగతి కనపడుతోందని ఐఐఎస్‌ఎస్ పేర్కొంది. నల్లసముద్రంలో రష్యా సైన్యంపై ఇలాంటి బోట్లను ఉక్రెయిన్ సమర్థంగా వినియోగించిన విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేసింది.

అణ్వాయుధాలు కూడా ప్రపంచ దేశాల ఆయుధ ఎజెండాలో ప్రముఖంగా నిలిచాయి. మిస్సైల్ సిలో(అండర్‌గ్రౌండ్ మిస్సైల్ లాంచ్ ఫెసిలిటీ)లను చైనా పెంచుకుంటూపోతుండగా.. వార్‌హెడ్లు, డెలివరీ సిస్టమ్స్‌ను అమెరికా ఆధునీకరించే పనిలో ఉందని ఐఐఎస్‌ఎస్ తన 65వ వార్షిక నివేదికలో వివరించింది.

గత 12 నెలల్లో ప్రపంచం మరింత ప్రమాదకర స్థితిలోకి జారిందని హెచ్చరించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలే ఇందుకు సూచికలని పేర్కొంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×