BigTV English

BRS meeting at Nalgonda: అన్యాయం జరిగితే పులిలా కొట్లాడుతా.. పిల్లిలా ఉండను: KCR

BRS meeting at Nalgonda:  అన్యాయం జరిగితే పులిలా కొట్లాడుతా.. పిల్లిలా ఉండను: KCR

BRS meeting at Nalgonda Highlights: నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకులేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నల్గొండలోని మర్రిగూడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.


కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది అన్నారు. అందుకే కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్గొండ సభకు వచ్చానని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాలు పరిరక్షించుకునేందుకు అనారోగ్యాన్ని లెక్కచేయకుండా వచ్చానన్నారు. ఇది రాజకీయ సభ కాదు ఉద్యమ సభ, పోరాట సభ అని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నల్గొండలో ప్లొరైడ్ సమస్య పరిష్కారం అయ్యిందని వెల్లడించారు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారన్నారు. ఆ నాడు ప్లొరైడ్ సమస్య వచ్చిన ఏ నాయకుడు రాలేదన్నారు.

రాష్ట్రంలో కోసం పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చానని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం వచ్చాక తన పదేళ్లు పాలనలో ఎవ్వరికీ తక్కవ చేయలేదన్నారు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారన్నారు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడివరకైనా పోరాడవచ్చని పేర్కొన్నారు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అని అప్పట్లో నేనే పాట రాశానని కేసీఆర్ అన్నారు.


బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యిందని కేసీఆర్ అన్నారు. దిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా జీవన్మరణ సమస్య కృష్ణా జలాలున్నాయన్నారు. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగాన్నారు. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్‌ ముందు పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా.. పిల్లి మాదిరిగా ఉండనని కేసీఆర్ అన్నారు.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×