BigTV English

Gulmarg Ski Resort : గుల్మార్గ్ అప్పుడలా.. ఇప్పుడిలా..!

Gulmarg Ski Resort : గుల్మార్గ్ అప్పుడలా.. ఇప్పుడిలా..!
Gulmarg Ski Resort

Gulmarg Ski Resort : గుల్మార్గ్ స్కీ రిసార్ట్.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి. హిమాలయాల్లోని పీర్ పంజాల్ రేంజ్‌లో కొలువుదీరి ఉందీ పట్టణం. శ్రీనగర్ నుంచి 50 కిలోమీటర్లు.. భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దు అయిన నియంత్రణ రేఖకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందీ రిసార్ట్. వాస్తవానికి ఈ సమయంలో గుల్మార్గ్‌లోని ఏటవాలు ప్రాంతాలన్నీ స్కీయర్లతో, స్నోబోర్డర్లతోనూ కిటకిటలాడుతుంటుంది.


జనవరి నెల వచ్చిందంటే చాలు.. ఈ స్కీ రిసార్ట్ టౌన్‌ను మంచు దుప్పటి కప్పేస్తుంది. ఆ మంచుగడ్డలపై స్కీయింగ్ చేసే టూరిస్టులతో ఎటు చూసినా సందడి కనిపిస్తుంటుంది. ఈ సారి మాత్రం ఆ కళ తప్పింది. ప్రసిద్ధి చెందిన వింటర్ స్కీ డెస్టినేషన్ల మాదిరిగానే గుల్మార్గ్‌లో కూడా మంచు అన్నదే కనిపించడం లేదు. ఎన్నడూ చవిచూడనంతగా పొడి వాతావరణాన్ని గుల్మార్గ్ వాసులు ఇప్పుడు చూస్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు ట్రావెలర్లు, టూరిజం ఆపరేటర్లను తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి.

ఈ స్కీ రిసార్ట్ 1330 మీటర్ల ఏటవాలు ప్రాంతం స్కీయింగ్ కు ఎంతో అనువుగా ఉంటుంది. అలాగే గుల్మార్గ్ గొండోలా ప్రముఖమైనది. 3,980 మీటర్ల ఎత్తులో ఈ కేబుల్ కారు రైడింగ్ చేసేందుకు టూరిస్టులు ఎంతో ఉత్సాహం చూపుతారు. ప్రపంచంలో అత్యంత పొడవైన, రెండో అతి ఎత్తైన కేబుల్ కార్ ఇదే. రైడింగ్‌తో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను చూసేందుకు కొందరు వస్తే.. ఇంకొందరు స్కీయింగ్ కోసమే వస్తుంటారు. అయితే ఈ సారి మంచు అంతగా లేకపోవడంతో స్కీయర్లు నిరాశకు గురయ్యారు.


ఈ నేపథ్యంలో డిసెంబర్‌లోనూ, ఈ నెల 21వ తేదీ వరకు చేసుకున్న బుకింగ్‌లన్నీ రద్దయిపోయాయి. కనీసం ఈ నెల ద్వితీయార్థంలోనైనా మంచు కురుస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. నిరుడు గుల్మార్గ్‌ను రికార్డు స్థాయిలో 16 లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. డిసెంబర్‌లో ఇక్కడ ఒకటి, రెండు సార్లు మాత్రమే మంచు కురిసింది. జనవరిలోనూ స్నో కురవాల్సి ఉన్నా.. ఎల్‌నినో కారణంగా ఆలస్యమవుతున్నట్టు భావిస్తున్నారు.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×