E-Paper
Advertisement

Pakistan Occupied Kashmir | పివోకేలో బ్రిటీష్ రాయబారి పర్యటన.. అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

Pakistan Occupied Kashmir | పాకిస్తాన్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి జేన్ మారియట్ జనవరి 10న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించింది. ఆమె పర్యటనపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై ఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషనర్ ఆఫీసులో జేన్ మారియట్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారికంగా ఫిర్యాదు చేసింది.

“ఒక బ్రిటన్ రాయబారిగా జేన్ మారియట్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్‌పూర్‌లో పర్యటించడం.. భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే అవుతుంది. ఈ అంశాన్ని మేము సీరియస్‌గా పరిగణిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కావు. అందుకే ఢిల్లీలో బ్రిటన్ హై కమిషన్ కార్యాలయంలో జేన్ మరియట్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాం,” అని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. సోషల్ మీడియాలో కూడా జేన్ మరియట్‌కు వ్యతిరేకంగా హిందుత్వ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు.

Advertisement

దీనిపై జేన్ మరియట్ స్పందిస్తూ.. ”70 శాతం బ్రిటీష్ పాకిస్తానీ పౌరులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతానికి చెందినవారే. బ్రిటన్, పాకిస్తాన్ ఇరు దేశాల సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించడానికే నేను మీర్‌పూర్ వెళ్లాను,” అని తెలిపింది.

ఇలాగే గత సంవత్సరం అక్టోబర్, డిసెంబర్ నెలల్లో అమెరికా అధికారులు పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్, గిల్‌గిట్ బాలిస్తాన్‌లలో పర్యటించారు. అప్పుడు కూడా భారత ప్రభుత్వ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

Pakistan Occupied Kashmir, Jane Marriott, British High Commission, Mirpur, India, Foreign Affairs, Diaspora,

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×