E-Paper
Advertisement

CHICAGO: చికాగోలో తెలుగు విద్యార్థులపై కాల్పులు

CHICAGO: చికాగోలో తెలుగు విద్యార్థులపై కాల్పులు
Advertisement

CHICAGO:చికాగోలో దారుణం జరిగింది. ఇద్దరు తెలుగు విద్యార్థులపై దుండగులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులలో ఒకరు తెలంగాణకు చెందిన చరణ్ గా గుర్తించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

చికాగో సౌత్ ప్రాంతంలో చరణ్, అతని స్నేహితుడిని నలుపు రంగు కారులో వచ్చిన నల్ల జాతీయులు వారిని అటకాయించారు. డబ్బులు ఇవ్వాలంటూ గన్ లతో బెదిరించారు. అంతటితో ఆగకుండా ఇద్దరు విద్యార్థులపై దోపిడి దొంగలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చరణ్ తో పాటు అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×