Big Stories

TS: టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల.. ఉద్యోగులకు డీఏ పెంపు..

TS: ప్రభుత్వ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు ,పదోన్నతులు చేపట్టనున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోనే అప్పీళ్లను పరిష్కరించనున్నారు.

- Advertisement -

ఇటీవల 13 జిల్లాల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ దంపతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి మౌనదీక్ష చేపట్టారు. వెంటనే పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే వందలాదిగా ఉపాధ్యాయులు తరలిరావడంతో కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మెహరించి ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. టీచర్ల వెంట ఉన్న వారి పిల్లలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఒక విడత డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజా పెంపుతో ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ 17.29 నుంచి 20.02కు పెరిగింది.

జనవరి పింఛన్ తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్ దారులకు చెల్లింపులు చేయనున్నారు. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్ లో జమ చేయనున్నారు.

అయితే, ఒక డీఏ మాత్రమే ఇవ్వడంపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. మిగతా పెండింగ్ డీఏలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News