BigTV English

Israel kills Hamas chief: హమాస్‌ అధినేత యాహ్య సిన్వార్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్

Israel kills Hamas chief: హమాస్‌ అధినేత యాహ్య సిన్వార్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్

Hamas chief Yahya Sinwar died confirms Israel: హమాస్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఈ దాడిలో హమాస్‌ కొత్త చీఫ్ యాహ్య సిన్వార్‌ మృతి చెందాడు. దీంతో హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా సిన్వార్‌ పట్టుకునేందుకు ప్రయత్నించిన ఇజ్రాయెల్ ఎట్టకేలకు పైచేయి సాధించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించింది.


గాజాలోని ఓ భవనం చేసిన దాడిలో సిన్వార్ మృతి చెందాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి సైతం నిర్దారించారు. ఈ మేరకు డీఎన్ఏ పరీక్షలు సైతం చేయడంతో ఓ కొలిక్కి వచ్చిందని తెలిపారు.ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఓ ప్రకటన విడుదల చేశారు.

హమాస్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో యాహ్య సిన్వర్‌ను హతమైనట్లు మొదట ప్రచారం జోరుగా సాగింది. గాజాలోని స్ట్రిప్ అనే ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. అయితే, మృతి చెందిన వారిలో యాహ్య సిన్వార్ కూడా ఉన్నట్లు తెలిసింది. నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్షలు చేసి ల్యాబ్‌కు పంపగా.. అతనే అని తేలింది. ఓ మిలటరీ కాల్పుల్లో చనిపోవడం ఆశ్చర్యం వేసింది.


Also Read: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో సిన్వార్ మాస్టర్ ప్లాన్ వేశారు. తొలిసారి జరిగిన ఈ దాడిలో దాదాపు 1200 మంది చనిపోయారు. అప్పటినుంచి సిన్వార్ చంపేందుకు ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఎన్నో భారీ స్కెచ్ లు వేసిన ప్రయోజనం కలగలేదు. కానీ ఓ భవనంపై చేసిన దాడుల్లో చనిపోవడం గమనార్హం.

Related News

California: చెట్టును తాకి లైవ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Big Stories

×