E-Paper
Advertisement

‘శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!

‘శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!
Advertisement

Solomon pappaiah: చిత్ర పరిశ్రమలో మరో విషాదం అభిమానులను దుఃఖంలోకి నెట్టివేసింది. తనదైన నటనతో శివాజీ సినిమాలో ఇద్దరమ్మాయిల తండ్రిగా తనదైన నటనను కనబరిచి, అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన.. తమిళ పండితుడు సోలమన్ పప్పయ్య (Solomon pappaiah) మృతి చెందారు. 90 సంవత్సరాలు వయసున్న ఆయన వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతోనే మధురైలోని తన నివాసంలో శుక్రవారము తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించడంతో పలువురు సినీ ప్రముఖులు , అభిమానులు సోలమన్ పప్పయ్య మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

శివాజీ నటుడు మృతి.. రజినీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి..

సోలమన్ పప్పయ్య మృతి పై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళంలో తన ఎక్స్ ఖాతాలో ఆయన స్పందించారు. గొప్ప తమిళ పండితుడు ప్రొఫెసర్ సోలమన్ పప్పయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. చర్చలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో పప్పయ్య కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అప్పటి వరకు విద్యావంతులు, ఉన్నత వర్గాలకే పరిమితమైన చర్చా కార్యక్రమాలను ఆయన సులభమైన సామాన్య భాషలో ప్రజలలోకి తీసుకెళ్లారని కొనియాడారు.

12 వేలకు పైగా చర్చా కార్యక్రమాలు..

Advertisement

సోలమన్ పప్పయ్య తన జీవిత కాలంలో సుమారుగా 12 వేలకు పైగా చర్చా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తమిళంలో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ శివాజీ లో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు మరికొన్ని చిత్రాలలో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. అలాంటి గొప్ప వ్యాఖ్యాత స్వర్గస్తులవడంతో అటు ప్రజలు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

ALSO READ:తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’.. త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్ అదుర్స్!

సోలమన్ పప్పయ్య కెరియర్..

Advertisement

ప్రముఖ జర్నలిస్టుగా పేరు సొంతం చేసుకున్న ఈయన సన్ టీవీలో 20 ఏళ్లకు పైగా ప్రసారమవుతున్న పట్టిమంద్రం(చర్చా కార్యక్రమం) టాక్ షో ద్వారా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇంతవరకు 12 వేలకు పైగా.. ప్రజలకు ఉపయోగపడే సామాజిక అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. తమిళ సాహిత్యాన్ని 60 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ గొప్ప తమిళ విధ్వంసులలో ఒకరిగా పేరు పొందిన ఈయన.. తమిళ భాషను ఉచ్చరించే తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది. భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ ఈయనకు 2021లో లభించింది. అంతేకాదు 2000 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం ద్వారా కళైమామణి పురస్కారం అందుకున్నారు.
2010లో అన్నామలై విశ్వవిద్యాలయం ద్వారా “ముత్తమిళ్ పెరరిజ్ఞర్ అవార్డు” అందుకున్న ఈయన ఆ తర్వాత
“తమిళ్ అరిజ్ఞర్”, “అయల్ కళై అరిజ్ఞర్” బిరుదులు కూడా సొంతం చేసుకున్నారు.

Related News

రెమ్యూనరేషన్ ను పెంచేసిన మమిత..? స్టార్ హీరో కంటే ఎక్కువే..

గవర్నర్‌ను కలిసిన మంచు మనోజ్, మౌనిక.. కొత్త ప్లాన్ ఇదేనా?

రేణు దేశాయ్ రీఎంట్రీ.. కాశీ మజిలీ ట్రైలర్ అదిరిపోయిందిగా!

ట్రైలర్ లేకుండానే థియేటర్లోకి నాని ‘ప్యారడైజ్’ మూవీ..క్లారిటీ ఇచ్చిన హీరో!

ఆకలి నుంచి పుట్టిన తిరుగుబాటు.. ‘రణబాలి’ అసలు స్టోరీ ఇదేనా?

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ ట్రైలర్

తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’.. త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్ అదుర్స్!

Big Stories

Advertisement
×