BigTV English

Hawaii: ఊరంతా కాలి బూడిద.. ఆ ఇల్లు మాత్రం సేఫ్.. ఎందుకంటే?

Hawaii: ఊరంతా కాలి బూడిద.. ఆ ఇల్లు మాత్రం సేఫ్.. ఎందుకంటే?
hawaii wildfires house

Hawaii: ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. కారుచిచ్చుకు నగరమంతా కాలి బూడిదైంది. చెట్లు, ఇళ్లు, వాహనాలు, వస్తువులు.. సమప్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇప్పుడా ప్రాంతం.. స్మశానంతో సమానం.


అమెరికా, హవాయి దీవిలోని లహైనా. రిసార్టు నగరంగా ఫేమస్. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుండేది. సడెన్‌గా మీదపడిన రాకాసి కార్చిచ్చు.. వేగంగా వ్యాపించింది. సర్వం తుడిచిపెట్టేసింది. నగరాన్ని బూడిద కుప్పగా మార్చేసింది. వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తు.. వందమందికి పైగా బలి తీసుకుంది.

అంతటి బీభత్సంలోనూ ఓ ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉండటం ఆసక్తికరంగా మారింది. పై ఫోటోలో.. రెడ్ కలర్ రూఫ్‌తో ఉన్నదే ఆ ఇల్లు.


ఆ ఇంటి చుట్టూ చూడండి.. ఎలా కాలిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయో. మధ్యలో దర్పంగా.. రాజసంగా.. ఎర్ర రం గులో ఠీవిగా నిలిచింది ఈ ఒకే ఒక్క ఇల్లు. ఆ బిల్డింగ్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. కనీసం మసి కూడా అంటుకోలేదు. ఊరంతటినీ కబలించిన ఆ అగ్ని పిశాచి.. ఈ ఇంటిని మాత్రం ఏమీ చేయలేకపోవడం విశేషం.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోషాప్‌ అస్సలే కాదు. పక్కా రియల్ పిక్స్.

అగ్నిప్రమాద సమయంలో ఈ ఇంటి ఓనర్స్ అందులో లేరు. విషయం తెలిసి వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. తమ ఇల్లే ఇలా సేఫ్‌గా ఉండటానికి ఓ కారణం కావొచ్చని చెబుతున్నారు. అదేంటంటే…

ఆ పాతకాలం ఇంటిని ఇటీవలే కొన్నారట ఆ ఓనర్స్. రెనొవేషన్‌లో భాగంగా.. ఆస్ఫాల్ట్ పైకప్పును తొలగించి.. భారీ బరువుండే మెటల్‌ రూఫ్‌ను ఏర్పాటు చేశారట. ఇంటి చుట్టూ గార్డెన్ ఉంటే.. దాన్ని కూడా తీసేసి.. బండలతో ఫ్లోరింగ్ చేయించారట. ఇదే ఇప్పుడు తమ ఇంటిని కాపాడి ఉండొచ్చని అంటున్నారు.

కార్చిచ్చు కమ్మేసినప్పుడు.. అగ్నికీలలు ఒక ఇంటి నుంచి మరో ఇంటిపైకి ఎగిరిపడి.. అలా అలా ఊరంతా తగలబడింది. అయితే, ఈ ఇంటిపైనా నిప్పు కణికలు పడినా.. మెటల్ రూఫ్ కావడంతో అంటుకోలేదు. మంటలు చెలరేగలేదు. ఇల్లు సేఫ్ అయిందని భావిస్తున్నారు. లక్ అంటే ఇట్లుండాలె అంటున్నారంతా.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×