BigTV English

Israel Hamas Conflict: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. బంధీలను వెంటనే విడుదల చేయాలి.. యూఎన్ లో భారత్ డిమాండ్!

Israel Hamas Conflict: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. బంధీలను వెంటనే విడుదల చేయాలి.. యూఎన్ లో భారత్ డిమాండ్!
Israel Hamas Conflict
Israel Hamas Conflict

Israel Hamas Conflict: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంపై మరోసారి భారత్ స్పందించింది. ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన మనవతా సంక్షోభం ఆమోద యోగ్యం కాదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిథి రుచిరా కాంబోజ్ అన్నారు. అక్కడ సంభవిస్తున్న మరణాలను కాపాడటం అత్యవసరమని స్పష్టం చేశారు.


గాజాలో ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన మనవతా సంక్షోభంగా ఆవేదన వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మరింత దుర్భరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని యూఎస్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తరఫు శాశ్వత ప్రతినిథి రుచిరా కాంబోజ్ తెలిపారు.

గాజాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. వారి ప్రాణాలు కాపాడాల్సిన అవసరం అత్యవసరం అని భారత్ అభిప్రాయాన్ని తెలియజేసింది. గత నెల 25వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానాన్ని సానుకూల చర్యగా భారత్ భావిస్తోందని తెలిపారు.


Also Read: తమపై దాడి చేసినా, దాడి చేయాలని ప్రయత్నించినా.. ప్రతిదాడులు తప్పవు: నెతన్యాహు

ఈ హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో భారత్ ఇప్పటికే పలుమార్లు తన స్పష్టమైన వైఖరిని ప్రపంచ దేశాల ముందు వెల్లడించింది. ఉగ్రవాది, బంధీలుగా చేసుకునే చర్యలను భారత్ గతంలో తీవ్రంగా ఖండించింది. తక్షణమే బంధీలను ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

యుద్ధం కారణంగా గాజాలో మరింత దుర్భర పరిస్థితి నెలకొనకుండా అక్కడి ప్రజలకు మనవతా సహాయాన్ని పెంచల్సిన అవసరం ప్రపంచ దేశాలపై ఉందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంకలో పాలస్తీనా ప్రజలకు భారత్ అందించే మానవతా సాయం కొనసాగుతుందని నొక్కి చెప్పారు. అయితే ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు ఎనలేనివని భారత్ కొనియాడింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×