BigTV English

Indian shot dead in US: అమెరికాలో భారతీయ నృత్య కళాకారుడు దారుణ హత్య

Indian shot dead in US: అమెరికాలో భారతీయ నృత్య కళాకారుడు దారుణ హత్య

 


Indian Classical dancer Amarnath Ghosh shot dead in Missouri


ఈ విషయాంపై నటి దేవలీన భట్టాచార్జి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ .. సాయంత్రం వాకింగ్ కు వెళ్లిన అమర్ నాథ్ ఘోష్ ను దుండగులు దారుణంగా కాల్చిచంపారని తెలియజేశారు. గత రెండు నెలల్లో అమెరికాలోని భారతీయ విద్యార్ధులపై జరుగుతున్న ఆరవ అఘాయిత్యమిది. నృత్యంపై ఎన్నో కలలతో ఉన్న అమర్ నాథ్ ఘోష్.. సెంట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ) చదువుతున్నారు. అమర్ నాథ్ ఘోష్. కుటుంబంలో ఒక్కడే సంతానం.

read more: పాక్‌లో పాలన గాడిన పడేనా..?

అతని తల్లి మూడేండ్ల కిందట మరణించగా, తండ్రి ఘోష్ చిన్నతనంలోనే మరణించారని నటి పేర్కొన్నారు. చెన్నైకి చెందిన కళాక్షేత్ర పూర్వ విద్యార్ధి ఈయన. చికాగోలేని ఇండియన్ కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు, యూనివర్శిటీ అధికారులతో చర్చించింది.

అమర్ నాథ్ ఘోష్ మృతి గురించి అధికారక సమాచారం ఏది అందకపోవడంతో.. తాము ఇప్పటికీ దందరగోళంలోనే ఉన్నామని పశ్చిమబెంగాల్ లోని సూరీ పట్టణంలో ఉంటున్న మావయ్య శ్యామల్ ఘోష్ తెలిపారు. ఘోష్ భౌతిక కాయాన్ని భారత్ కు తరలించేందుకు సహకరించాలని అమెరికాలోని భారత రాయబార కార్యలయం, విదేశి వ్యవహారాల ఎస్ జై శంకర్, ప్రధాని నరేంద్ర మోడీకి నటి దేవలీన భట్టాచార్జి విజ్ఞ‌ప్తి చేసారు.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×