BigTV English

OTT Movie : సిటీలో వరుస హత్యలు… లేడీ ఆఫీసర్ కళ్ళముందే తిరిగే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ, క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : సిటీలో వరుస హత్యలు… లేడీ ఆఫీసర్ కళ్ళముందే తిరిగే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ, క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : ఎక్కడ చూసినా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు సందడి చేస్తున్నాయి. సినిమాలు, సిరీస్ లలో కూడా ఈ జానర్ స్టోరీలు ట్రెండ్ అవుతున్నాయి. వేరే భాషల్లో నుంచి కూడా రీమేక్ లు చేసి మరీ వదులుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ‘ఫ్లవర్ ఆఫ్ ఈవిల్’ అనే కొరియన్ థ్రిల్లర్ ఆధారంగా, బాలీవుడ్ లో ‘దురంగా’ పేరుతో రీమేక్ చేశారు. ఈ కథ ముంబై సిటీలో జరిగే వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది. ప్రతీ ఎపిసోడ్ వహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘దురంగా’ అనేది హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. 2022లో మొదటి సీజన్, 2023లో సీజన్ 2 వచ్చింది. సీజన్ 1కు ప్రదీప్ సర్కార్, అజాజ్ ఖాన్, సీజన్ 2కు రోహన్ సిప్పీ దర్శకత్వం వహించారు. ఇందులో అమిత్ సాధ్, ఇరా పటేల్, హెరా మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌లో మొత్తం 16 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో సీజన్ లో 8 ఎపిసోడ్ ల చొప్పున IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ రెండు సీజన్ లు Zee 5 లో అందుబాటులో ఉన్నాయి.

స్టోరీలోకి వెళ్తే

సమ్మిట్ పటేల్ తన భార్య ఇరా, కూతురు రుద్రణాతో హ్యాపీగా ఉంటాడు. పోలీసు ఇన్‌స్పెక్టర్ గా ఇరా ఎప్పుడూ కేసుల చుట్టూ తిరుగుతుంటుంది. ఒక రోజు ముంబైలో అలజడి మొదలవుతుంది. వరుసగా హత్యలు జరుగుతాయి. అన్ని హత్యలు ఒకే రకంగా జరుగుతుంటాయి. ఈ హత్యలను ఒక్కడే చేస్తున్నాడని ఇరాకి అర్థం అవుతుంది. ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ మర్డర్స్ అభిషేక్ అనే వ్యక్తి గతంలో చేసిన హత్యాలను పోలి ఉన్నట్లు  తెలుసుకుంటుంది. అయితే అతను కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ హత్యలు అతను చేసినట్టే ఎలా జరుగుతున్నాయనే అనుమానం ఇరాకు వస్తుంది.


Read Also : భార్య శవం మిస్సింగ్… భర్తతో పాటు అతని ప్రేయసికీ చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్టు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ఈ సమయంలో ఇరాకు తన భర్త సమ్మిట్ పటేల్ మీద అనుమానం వస్తుంది. అతని గురించి ఇరా ఒక షాకింగ్ రహస్యం తెలుసుకుంటుంది. సమ్మిట్ మరెవరో కాదు, అతను ఒక సీరియల్ కిల్లర్. అతని గతం దాచిపెట్టి ఇరాను పెళ్లి చేసుకున్నాడు. ఈ హత్యలు చేస్తున్నది తన భర్తే అనుకుని జైలుకు కూడా పంపుతుంది. ఇక సీజన్ 2లో నిజమైన సమ్మిట్ పటేల్ 17 సంవత్సరాల కోమా తరువాత మెలుకువలోకి వచ్చి ఇరా దగ్గరికి వస్తాడు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఊహించని ట్విస్టులతో ఈ సిరీస్ నడుస్తుంది. చివరికి అసలు సమ్మిట్ ఎవరు ? ఎందుకు కోమాలో ఉన్నాడు ? హత్యలు ఎవరు చేస్తున్నారు ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో అమ్మాయితో ఆ పని చేసే ప్రొడ్యూసర్… నెక్స్ట్ ప్యాంటు తడిచిపోయే ట్విస్ట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఆంటీ అరాచకం… గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్‌ను వదిలేసి అబ్బాయిలతో ఆ పని చేసే అమ్మాయితో… పిచ్చెక్కించే లవ్ స్టోరీ మావా

OTT Movie : 2024 టాప్ 5 అంతర్జాతీయ చిత్రాలలో ఒకటి… థియేటర్లలో అడ్డంకులు… మోస్ట్ కాంట్రవర్సీ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి

OTT Movie : చంపి శవాలను మాయం చేసే కిల్లర్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : బాస్ భార్యతో యవ్వారం… ఈ ఆటగాడి ఆటలు మాములుగా ఉండదు భయ్యా

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలో ‘సెర్చ్’… ఈ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడటానికి గల కారణాలు ఇవే

Big Stories

×