OTT Movie : అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ‘సంతోష్’ అనే పోలీస్ ప్రొసీజరల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అవ్వాల్సి ఉండగా, సెన్సార్ నిబంధనల కారణంగా థియేటర్లలో విడుదల కాలేదు. అయితే నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ దీనిని 2024లో టాప్ ఐదు అంతర్జాతీయ చిత్రాలలో ఒకటిగా ప్రశంసించింది. డిసెంబర్‌లో 97వ అకాడమీ అవార్డ్స్ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కోసం షార్ట్‌లిస్ట్‌లో అధికారిక ఎంట్రీగా ఇచ్చింది. అయితే కొన్ని సెన్సిటివ్ అంశాల కారణంగా ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో కి రాబోతోంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘సంతోష్’ (Santosh) 2024లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సంధ్యా సూరి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో షహానా గోస్వామి, సునీతా రాజ్వర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జనవరి 10 నుంచి PVR థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా సెన్సార్ వల్ల ఆలస్యం అయింది. అయితే ఈ నెల 17 నుంచి లయన్స్‌గేట్ ప్లే లో అందుబాటులోకి వస్తోంది.
సంతోష్ అనే మహిళ భర్త పోలీసు కానిస్టేబుల్ గా డ్యూటీలో చనిపోతాడు. దీంతో సంతోష్‌కు ఆమె భర్త జాబ్ వస్తుంది. ఆమె ఒక గ్రామంలో కానిస్టేబుల్ గా జాయిన్ అవుతుంది. కానీ అక్కడ ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆమెను ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోరు. ఆమె తక్కువ కులానికి చెందటంవల్ల, పైగా మహిళ కావడంతో అందరూ ఆమె పట్ల చిన్న చూపు చూస్తుంటారు. సంతోష్ ఈ విషయంలో చాలా బాధపడుతుంది. భర్త పోయి ఒక వైపు దుఃఖంలో ఉంటే, ప్రస్తుత పరిస్థితి ఆమెను ఇంకా కుంగదీస్తుంది. అయితే ఆమె వీటిని తట్టుకుని ధైర్యంగా ముందుకు వెళ్తుంది. అదే స్టేషన్లో ఉండే ఇన్స్పెక్టర్ గీతా ఆమెకు ఓదార్పును ఇస్తుంది.
Read Also : పేదమ్మాయిపై ప్రేమ… మొత్తం మత్తెక్కించే సీన్లే భయ్యా… ఒంటరిగా చూడాల్సిన మూవీ