BigTV English

India-Maldives Diplomatic Tensions : బోట్ల అడ్డగింతపై వివరణ ఇవ్వాలి.. భారత్‌ను కోరిన మాల్దీవుల విదేశాంగ శాఖ..

India-Maldives Diplomatic Tensions : బోట్ల అడ్డగింతపై వివరణ ఇవ్వాలి.. భారత్‌ను కోరిన మాల్దీవుల విదేశాంగ శాఖ..
India-Maldives Diplomatic Tensions

India-Maldives Diplomatic Tensions : భారత్‌ (India), మాల్దీవుల (Maldives) మధ్య దౌత్యపరమైన వివాదం ముదురుతోంది. రెండు దేశాల సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన చేసింది. జనవరి 31న విదేశీ మిలిటరీకి చెందిన సిబ్బంది.. మాల్దీవుల ఫిషింగ్ ఓడలో ఎక్కినట్లు సమాచారం అందిందని ఆ ప్రకటనలో పేర్కొంది. అక్కడికి చేరుకోగానే వారు భారత తీర రక్షక దళానికి చెందినవారని తేలిందని స్పష్టం చేసింది. భారత తీర రక్షక సిబ్బంది మరో రెండు పడవల్లో ఎక్కినట్లు మాల్దీవుల మిలిటరీ గుర్తించిందని తెలిపింది.


ఈ విషయంపై మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిబ్రవరి 1, 2024న భారత్‌ను వివరణ కోరుతూ అధికారికంగా లేఖ రాసింది. ఎక్స్‌క్లూజీవ్ ఎకనామిక్ జోన్‌లో మాల్దీవులు చేపలు పట్టే సమయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘించి భారత్ ఆపరేషన్ చేపట్టిందని.. దానిపై వివరణ ఇవ్వాలని తెలిపింది. తమ దేశానికి చెందిన ఫిషింగ్ బోట్లను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని.. సమగ్ర వివరాలు సమర్పించాలని ఆ లేఖలో పేర్కొంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, 253 బృందాలు ఫిషింగ్ బోట్‌లను ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపింది. కాగా దీనిపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు.

మహ్మద్‌ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. భారత్‌ సైనిక బలగాలు తమ దీవులను విడిచి వెళ్లిపోవాలని ముయిజ్జు గడువు విధించిన సంగతి తెలిసిందే.


Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×