BigTV English

No Diwali In Canada: భారతీయుల పట్ల వివక్ష.. కెనెడాలో దీపావళి వేడుకలు రద్దు

No Diwali In Canada: భారతీయుల పట్ల వివక్ష.. కెనెడాలో దీపావళి వేడుకలు రద్దు

No Diwali In Canada| కెనెడా, ఇండియా మధ్య సంబంధాలు రోజురోజుకీ బలహీనపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో అగ్గికి ఆజ్యం పోసినట్లుగా కెనెడా ప్రధాన ప్రతిపక్ష నేత, ఒట్టావా నగర ఎంపీ పియెర్ పొయిలివర్ కెనెడా ప్రధాన నగరంలో సంప్రదాయంగా జరిగే దీపావళ్లి వేడుకలు రద్దు చేశారు. ఒట్టావాలో గత 23 సంవత్సరాలుగా దీపావళి వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. ఆ సంప్రదాయానికి పియెర్ పొయిలివర్ బ్రేక్ వేశారు. దీంతో కెనెడాలో భారతీయ సామాజికవర్గం అక్కడి ప్రభుత్వంపై మండిపడుతోంది. ఇది భారతీయులపట్ల, హిందువుల పట్ల వివక్ష అని భారత మూలాలున్న కెనెడా పౌరులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.


గత 23 సంవత్సరాలుగా ఒట్టావా నగరంలో ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కెనెడా (OFIC) అనే సంస్థ దీపావళి వేడుకలు నిర్వహిస్తోంది. అయితే రెండు రోజుల క్రితం ఈ సంవత్సరం దీపావళి వేడుకలు జరుపుకోవాడనికి వీల్లేదని, వేడుకల కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పియెర్ పోయిలివర్ OFIC కి లేఖ రాశారు. దీంతో OFIC అధ్యక్షడు శివ్ భాస్కర్ ఈ లేఖ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది భారతీయుల పట్ల వివక్ష, పండుగ వేడుకల కార్యక్రమం రద్దు చేయడం చాలా అనాలోచిత నిర్ణయమని అన్నారు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?


ఒట్టావా ఎంపీ పియెర్ పొయిలివర్ కు శివ్ భాస్కర్ దీపావళి వేడుకలు ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వలని లేఖ రాశారు. “దీపావళి సంతోషాలు పంచుకునే పండుగ. ఈ పండుగను ఇండియా, కెనెడా సామాజలు చాలా సంవత్సరాలు కలిసి జరుపుకుంటున్నాయి. ఇరు దేశాల సంప్రదాయాల సమ్మేళనానికి దీపావళి ఒక ప్రతీక. కానీ మీరు రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ వాతావరణం కారణంగా.. ఇలా ఒక్కసారిగా సంప్రదాయ వేడుకలను రద్దు చేయడంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది అన్యాయం. చాలా అనాలోచిత చర్య.

మీ నిర్ణయాలు భారత మూలాలున్న కెనెడా పౌరుల పట్ల వివక్షను చూపుతున్నాయి. భారత ప్రభుత్వం లేదా కెనెడా ప్రభుత్వం మధ్య ఏం జరిగినా ఆ రాజకీయ పరిణామాలకు మేము బాధ్యులం కాదు. మీ చర్యలు జాత్యాహంకారం, వివిక్షను సూచిస్తున్నాయి. మేము ఈ దేశ పౌరులం. మా పూర్వీకులు ఇండియాకు చెందిన వారు కావడం వల్లే మా పట్ల మీరు ఈ వివక్ష చూపుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే మీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ” అని రాశారు.

దీపావళి వేడుకలు అక్బోటర్ 30న కనర్జేవేటివ్ పార్టీ ఎంపీ టాడ్ డోహర్టీ ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా.. ఆ వేడుకలు పార్టీ నాయకుడు పియెర్ పొయిలివర్ రద్దు చేశారు.

దీపావళి వేడుకలు రద్దు చేయడంపై కెనెడాలోని హిందువలందరూ పియెర్ పొయిలివర్ తన చర్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పండుగ వేడుకలు రద్దు కావడంతో ఒట్టావాలోని హిందువులందరికీ OFIC సంస్థ క్షమాపణలు తెలియజేసింది నవంబర్ 23 వేడుకలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఒట్టావా నేపియన్ లోని సెడాల్ హిల్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ లో వేడుకలు నిర్వహిస్తామని శివ్ భాస్కర్ తెలిపారు.

2023లో ఒట్టావాలోని పార్లమెంట్ హిల్ లో ఇండో కెనెడియన్ ఎంపీ చంద్రశేఖర్ ఆర్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు జరిగాయి.

కొన్ని రోజుల క్రితం కెనెడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారతదేశ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2023లో జరిగిన ఖలిస్తాన్ వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక క్రిమినల్ గ్యాంగ్స్ తో కలిసి భారతదేశం ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపణలు చేశారు. ఆ తరువాత కెనెడా దేశంలోని ఇండియన్ అంబాసిడర్ హై కమిషనర్ కు ఇండియాకు తిరిగి పంపారు. దీంతో భారతదేశ ప్రభుత్వం కూడా కెనెడా అంబాసిడర్ ని వారి దేశం తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.

Related News

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

Big Stories

×