BigTV English

California: భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి..

California: భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి..
California

Indan Family Dead -California (news paper today):


అమెరికాలో ఓ భారతీయ జంట, వారి కవల పిల్లలు అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. శాన్‌మాంటియోలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. మృతి చెందిన దంపతులను ఆనంద్ సుజిత్ హెన్రీ(42), అలైస్ బెంజైగర్ ఉరఫ్ ప్రియాంక(40), వారి కవల పిల్లలు నోవా, నాథన్(4)గా గుర్తించారు.

ఆనంద్ కుటుంబానిది కేరళలోని కొల్లం కాగా కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.
విగతజీవులైన ఆనంద్ ఇద్దరు కొడుకులను వారి బెడ్‌రూంలో, ఆనంద్, ఆయన భార్య మృతదేహాలను బాత్రూంలో గుర్తించారు. భార్యాభర్తల శరీరాలపై తుపాకీ తూటాల గాయాలు ఉన్నాయి.


Read More: కాంగోలో పడవ మునక.. 37మంది మృతి!

9 ఎంఎం పిస్టల్ సాయంతో వారు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు అనంతరమే హత్యా? ఆత్మహత్యా? అనేది తేలుతుందని పోలీసులు వెల్లడించారు.

911 కాల్ స్వీకరించిన పోలీసులకు అనంతర తనిఖీలతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. ఆనంద్ ఇటీవలే తన ఐటీ కొలువుకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగినట్టు పోలీసులకు గతంలో అందిన ఫోన్ కాల్స్ వెల్లడిస్తున్నాయి.

Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×