BigTV English

BJP Candidates For Rajyasabha Elections: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్‌ పోటీ..

BJP Candidates For Rajyasabha Elections: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్‌ పోటీ..

BJP Rajyasabha Candidates Second List: రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశా నుంచి బరిలోకి దిగనున్నారు. మరో కేంద్రమంత్రి ఎల్ . మురుగన్ మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేయనున్నారు. అశ్వినీ వైష్ణవ్, ఎల్. మురుగన్ రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.
అశ్వినీ వైష్ణవ్‌కు ఒడిశాలో అధికార పార్టీ బిజూ జనతాదళ్‌ సపోర్టు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.


మధ్యప్రదేశ్‌లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో 4 బీజేపీకే దక్కే ఛాన్స్ ఉంది. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా. మధ్య ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థులుగా మరుగన్ తోపాటు ఉమేశ్‌ నాథ్‌ మహరాజ్‌, మాయ మరోలియా, బన్సీలాల్‌ గుర్జార్‌ ను ప్రకటించారు.

రాజస్థాన్‌లో 2 స్థానాలకు బీజేపీ పోటీ చేస్తోంది. మాజీ మంత్రి చున్నీలాల్‌ గరాసియా, మాజీ ఎమ్మెల్యే మదన్‌ రాథోడ్‌ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ పీఎం మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ పదవీ కాలం ఏప్రిల్‌ 3తో ముగుస్తుంది.


Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×