E-Paper
Advertisement

ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!
Advertisement

Kenya Helicopter Crash: ఉత్తర కెన్యాలోని సంబూరు కౌంటీలో గురువారం ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. లోయిసాబా కన్సర్వెన్సీ నుంచి బయలుదేరి ఇవాసో నైరో ప్రాంతానికి వెళ్తున్న ఒక హెలికాప్టర్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ విషాదకర సంఘటనలో పైలట్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నారని వాషింగ్టన్‌లోని అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. మృతుల్లో ప్రముఖ వార్తా సంస్థ ఎన్‌బీసీ (NBC) ఎగ్జిక్యూటివ్ జోస్ సువెరెజ్‌తో పాటు ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ అధిపతి సెన్సీ కూడా ఉన్నారు.

Advertisement

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేక వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో స్థానిక అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనపై అమెరికా అధికారులు విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: రేవంతే మా రోల్ మోడల్.. ఢిల్లీ భేటీలో సిడబ్ల్యూసీ సంచలన నిర్ణయాలు!

Tags

Related News

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

Big Stories

Advertisement
×