E-Paper
Advertisement

సూపర్ కూలింగ్ అందించే.. రియల్‌మీ కొత్త ఫ్రిజ్!

సూపర్ కూలింగ్ అందించే.. రియల్‌మీ కొత్త ఫ్రిజ్!
Advertisement

Realme TechLife 84L single door frige: ఇంటి కోసం లేదా బ్యాచిలర్ రూమ్‌ల కోసం ఒక మంచి రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కువ స్థలం తీసుకోని, తక్కువ బడ్జెట్‌లో లభించే మోడల్స్ కోసం వెతుకుతుంటాము. అలాంటి వారి కోసం ప్రముఖ బ్రాండ్ రియల్‌మీ (realme) తన టెక్‌లైఫ్ సిరీస్ కింద అద్భుతమైన ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. సుమారు రూ.9,490 ధరతో అందుబాటులో ఉన్న ఈ మినీ ఫ్రిజ్ అద్బుతమైన ఫీచర్లు కలిగి ఉంది. అంతే కాకుండా ఇది రూ. 10 వేల లోపే లభిస్తోంది. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిజైన్ & స్పేస్ సేవింగ్:

ఈ ఫ్రిజ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే.. దీని చిన్న సైజే! 84 లీటర్ల కెపాసిటీ ఉండే ఈ ఫ్రిజ్.. చిన్న కిచెన్‌లు, హాస్టల్ రూమ్స్, సింగిల్ రూమ్ అపార్ట్‌మెంట్లు లేదా ఆఫీస్ క్యాబిన్లలో చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. బయటికి చిన్నగా కనిపిచినా, లోపల మాత్రం పండ్లు, కూరగాయలు, పాలు, కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి చక్కటి స్పేస్ ఉంటుంది. అంతే కాకుండా ఇది చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ:

Advertisement

ఈ ఫ్రిజ్ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పని చేస్తుంది. దీని వల్ల మనం పెట్టే స్నాక్స్, కూల్ డ్రింక్స్ చాలా త్వరగా చల్లబడిపోతాయి. ఎండాకాలంలో.. కూడా కూలింగ్ తగ్గిపోతుందనే టెన్షన్ ఉండదు. తక్కువ కరెంట్‌ను వాడి సూపర్ కూలింగ్‌ని ఇస్తుంది. రోజూ మనకు కావాల్సిన బేసిక్ కూలింగ్ అవసరాలకు ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

ఎనర్జీ ఎఫిషియెన్సీ , మెయింటెనెన్స్:

కరెంట్ బిల్లు గురించి ఎక్కువగా టెన్షన్ పడే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది 2-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి.. కరెంట్ చాలా తక్కువ ఖర్చవుతుంది. ఇక దీని మోటార్ చాలా సైలెంట్‌గా పనిచేస్తుంది. ఎలాంటి పెద్ద సౌండ్‌లు రావు. ఫ్రిజ్‌ని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ. దీనికి ఇచ్చిన గ్లాసీ ఫినిష్ లుక్ మన ఇంటికి లేదా రూమ్‌కి ఒక రిచ్ లుక్‌ని ఇస్తుంది.

Advertisement

Also Read: చిన్న కిచెన్ల కోసం బెస్ట్ సోలో.. మైక్రోవేవ్ ఓవెన్ !

బడ్జెట్, వాల్యూ ఫర్ మనీ:

మార్కెట్లో దొరికే వేరే బ్రాండ్ల మినీ ఫ్రిజ్‌లతో పోలిస్తే.. రియల్‌మీ టెక్‌లైఫ్ ఫ్రిజ్ రేట్ చాలా రీజనబుల్‌గా ఉంది. కేవలం రూ.9,490 ధరకే రావడం దీనిలో అసలైన ప్లస్ పాయింట్. తక్కువ బడ్జెట్‌లో.. మంచి, నమ్మకమైన బ్రాండ్ ఫ్రిజ్ కావాలనుకునే వాళ్లకు ఇది వంద శాతం పర్‌ఫెక్ట్ ఛాయిస్.

మీరు బ్యాచిలర్ అయినా, చిన్న ఫ్యామిలీ అయినా లేదా ఆఫీస్ పనుల కోసం ఒక మంచి మినీ ఫ్రిజ్ వెతుకుతుంటే.. ఈ మోడల్ వెంటనే తీసుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువకాలం పాడవకుడా ఉండే మంచి కూలింగ్ ఫ్రిజ్ కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్!

Related News

మ్యాప్ నేవిగేషన్ సపోర్ట్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. ధర ఎంతంటే?

చిన్న కిచెన్ల కోసం బెస్ట్ సోలో.. మైక్రోవేవ్ ఓవెన్ !

చిన్న ఫ్యామిలీ, ఆఫీసులకు పర్ఫెక్ట్.. తక్కువ ధరలో బెస్ట్ మోడల్

రూ.15వేలలోపే అదిరిపోయే టీవీ.. థామ్సన్ నుంచి సూపర్ మోడల్!

లుక్ అదుర్స్..వర్క్ నెక్స్ట్ లెవెల్! ఫోన్‌తో.. కంట్రోల్ చేసే స్మార్ట్ వాషింగ్ మెషీన్

రూ.1,999లకే అద్భుతమైన ఫీచర్లు..ఈ స్మార్ట్‌ వాచ్‌పై ఓ లుక్కేయండి

కరెంట్ సబ్ స్టేషన్ లో కంకర ఎందుకు పరుస్తారు? ఇదీ అసలు కథ!

Big Stories

Advertisement
×