E-Paper
Advertisement

వందకోట్ల ‘ఇరుముడి’?– ఇదీ రవితేజ స్టామినా !

వందకోట్ల ‘ఇరుముడి’?– ఇదీ రవితేజ స్టామినా !
Advertisement

Ravi Teja’s Irumbu Success: ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పటి నుండి ఒక లెక్క అంటున్నాడు మాస్ మహారాజ రవితేజ.అవును రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ అంటోని, డిస్కో రాజా,క్రాక్, కిలాడీ,రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా,వాల్తేరు వీరయ్య, రావణాసుర,టైగర్ నాగేశ్వరరావు, ఈగల్. మిస్టర్ బచ్చన్,మాస్ జాతర, భర్త మహాశయులకి విజ్ఞప్తి..అంటూ ఏకంగా 15 సినిమాలు చేశాడు.

వీటిలో సూపర్ హిట్ అయినవి చూస్తే క్రాక్,ధమాకా సినిమాలే కనిపిస్తాయి.ఇక వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయినా అది కాస్తా చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిన పరిస్థితి .

ఏది ఏమైనా హిట్టు కొట్టి తీరాల్సిందే

Advertisement

ఇక ఈ క్రమంలో శివ నిర్వాణతో తలపెట్టిన ఇరుముడి సినిమా ఏది ఏమైనా హిట్టు కొట్టి తీరాల్సిందే అన్న పరిస్థితి. ఇక సినిమా కూడా రిలీజ్ కి ముందు మంచి అంచనాలే మోయడంతో మాస్ మహారాజ కి హిట్ ఈసారి పక్కా అనుకున్నారంతా.కానీ ఇరుముడి సినిమా థియేటర్ లలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి మారిపోయింది.సినిమా హిట్ అవుతుందనుకున్న వారందరికీ పెద్ద షాక్ ఇస్తూ బ్లాక్ బస్టర్ టాక్ ని మూట గట్టుకుంది.ముఖ్యంగా చివర్లో వచ్చిన మల్లెపూల పల్లకి పాటకి అభిమానులు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతున్నారు.

మొదటి రోజే ఏకంగా

దీంతో సినిమా ఊహించని విధంగా వసూళ్ళ సునామి స్ప్రుష్టిస్తుంది. అలా సినిమా మొదటి రోజు ఇండియాలో 17 కోట్లు కలెక్ట్ చేసిన ఇరుముడి ఓవర్ సీస్ లో ఏకంగా 4.5 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. అలా ఓవరాల్ గా మొదటి రోజే ఏకంగా 30 కోట్ల వసూళ్లతో స్టామినా ఎక్కడా తగ్గలేదని ప్రూవ్ చేశాడు.

మొత్తంగా రెండో రోజుకే

Advertisement

ఇక రెండు రోజు ఇండియాలో 19 కోట్లు రాబట్టిన సినిమా ఓవర్సీస్‌లో ఏకంగా 12 కోట్లు రాబట్టడం విశేషం.మొత్తంగా రెండో రోజుకే 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేసి టాలీవుడ్ లోని పలు రికార్డులని తిరగరాసేసింది.

వంద కోట్ల క్లబ్ లోకి

ఇక మూడో రోజుకి ఎంటర్ అయిన సినిమా ఇప్పటి వరకు ఉన్న ట్రేడ్ లెక్కల్ని చూస్తే ఇప్పటి వరకు సినిమా దాదాపు వెయ్యి స్క్రీన్ లలో ,రెండువేల షోలతో దూసుకుపోవడం బట్టి అంచనా వేస్తే మూడో రోజుకి ఈజీగా ఈ సినిమా దాదాపు ముప్పై కోట్ల గ్రాస్ కొల్లగొట్టి వంద కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండితులు.అదే జరిగితే మాత్రం ఇండస్ట్రీ మళ్ళీ వరుస సినిమాలతో కళకళలాడటం ఖాయం.పైగా ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న రవి తేజకి సాలిడ్ కమ్ బ్యాక్ దొరికినట్టే.

ఇంకెన్ని వసూల్లని కొల్లగొడతాడో !

సినిమా విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా స్వాసికా విజయ్ అదరగొట్టింది.ఇక సాయికుమార్, అజయ్ ఘోష్ లు తమ ఫెర్ఫామెన్స్ తో ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టిస్తున్నారు.

also read :మాధురి రాథోడ్ చేసిన పాపులర్ ఫోక్ సాంగ్స్ ఇవే !

చూడాలి మరి ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టుగా ఎట్టకేలకి సాలిడ్ బ్లాక్ బాస్టర్ అందుకున్న రవి తేజ ముందు ముందు ఇంకెన్ని వసూల్లని కొల్లగొడతాడో !

Tags

Related News

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

Big Stories

Advertisement
×