BigTV English

Indian Origin Family Died : కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి.. ప్రమాదమా? హత్యలా ?

Indian Origin Family Died : కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి.. ప్రమాదమా? హత్యలా ?

Indian Origin Family Died in Canada


Indian Origin Family Died in Canada(Today news paper telugu): కెనడాలో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మార్చి 7వ తేదీన ఒంటారియో ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటారియో ప్రావిన్స్ లో వారు నివాసం ఉంటున్న ఇంటిలో మంటలు చెలరేగడంతో దంపతులతో పాటు వారి 16 ఏళ్ల కుమార్తె కూడా మృతి చెందింది. గతవారమే ఈ ఘటన జరగగా.. శుక్రవారం (మార్చి 15) కాలిన స్థితిలో ఉన్న వారి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాలను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. మృతులు రాజీవ్ వరికూ (51), ఆయన భార్య శిల్పా కొత్త (47), కుమార్తె మహెక్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటన అగ్నిప్రమాదం వల్ల జరిగింది కాదని అనుమానిస్తున్నారు. బ్రాంప్టన్ లోని బిగ్ స్కై వే, వాన్ కిర్క్ డ్రైవ్ పరిసరాల్లోని ఓ ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మరణించారు. 15 ఏళ్లుగా ఎలాంటి సమస్య లేకుండా ఇక్కడే నివాసం ఉంటున్న ఫ్యామిలీ.. గతవారం మంటల్లో కాలి చనిపోవడం అనుమానంగానే ఉందని స్థానికుడైన యూసఫ్ పోలీసులకు తెలిపాడు.


ఈ నేపథ్యంలో ముగ్గురు మరణాలపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అగ్నిప్రమాదం వెనుక హత్య కుట్ర కోణం ఉందని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×