BigTV English

Iran Latest News : వారంలో అణుబాంబు.. అదీ ఇరాన్ సత్తా!

Iran Latest News : వారంలో అణుబాంబు.. అదీ ఇరాన్ సత్తా!
 Iran Latest News

Iran Latest News : ఇరాన్ తలచుకుంటే చాలు.. ఓ వారం రోజుల్లోనే అణుబాంబును సిద్ధం చేసేయగలదు. అంటే వారంలో ఒక బాంబు తయారీకి అవసరమైన యురేనియాన్ని ఆ దేశం ఉత్పత్తి చేయగలదన్నమాట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. అమెరికా ఫిజిస్ట్, అణ్వాయుధ కార్యక్రమాలపై గట్టి పట్టు ఉన్న ప్రముఖ నిపుణుడు డేవిడ్ ఆల్‌బ్రైట్. మరిన్ని అణ్వాయుధాలను శరవేగంగా సిద్ధం చేయగలిగినంత వెపన్-గ్రేడ్ యురేనియం ఆ దేశం వద్ద ఉందని కూడా చెప్పారు.


2003 నాటి పరిస్థితులతో పోలిస్తే.. అణ్వస్త్ర తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ బాగా పెంచుకుందని వివరించారు. నెలకు ఆరు అణుబాంబులను తయారు చేసేంత మోతాదులో వెపన్-గ్రేడ్ యురేనియం నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆ తర్వాత 5 నెలల్లోనే 12 అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియాన్ని ఉత్పత్తి కూడా చేయగలదని స్పష్టం చేశారు. ఏకైక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం రష్యా నుంచి ఇరాన్ యురేనియం పొందుతోంది.

భూమ్మీద లభ్యమయ్యే మూలకాల్లో చాలా తక్కువ మోతాదులో దొరికేది యురేనియం. ప్రధానంగా దీనిని అణు ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. అణువిద్యుత్‌ కేంద్రాల్లో దీని నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. కెనడాలోని సిగార్ లేక్‌లో హైగ్రేడ్ యురేనియం ఉత్పత్తి అవుతోంది. 2014 నుంచీ అక్కడ 105 మిలియన్ పౌండ్ల రేడియోధార్మిక పదార్థాన్ని తవ్వితీశారు.


కెనడాలో యురేనియం నిల్వలు అధికస్థాయిలో ఉన్నాయి. 1945 తర్వాత అత్యధిక మొత్తంలో యురేనియం తయారైంది ఆ దేశంలోనే. ఆ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 3.5 మిలియన్ టన్నుల యురేనియం ఉత్పత్తి జరిగింది. ప్రపంచ ఉత్పత్తిలో 29% యురేనియం కెనడా, అమెరికా రాష్ట్రాల నుంచే. గత కొన్ని దశాబ్దాలుగా ఆ దేశాల్లో 9.32 లక్షల టన్నుల మేర మైనింగ్ జరిగింది.

యురేనియం ఉత్పత్తిలో కెనడా వాటా 17.4%. అమెరికా, రష్యా దేశాలు 11.9 శాతం వాటాతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కజకిస్థాన్ వాటా 11%, ఆస్ట్రేలియా వాటా 7.6 శాతంగా ఉంది. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో యూఎస్ఎస్ ఆర్ 3.77 లక్షల యురేనియాన్ని తవ్వి తీసింది. అణు రియాక్టర్ల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా.. 1960-80 మధ్య కాలంలో యురేనియం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 436 అణు‌రియాక్టర్లు పనిచేస్తున్నాయి. రక్షణపరమైన అవసరాల కోసమే కాకుండా విద్యుదుత్పత్తిలోనూ ఈ మూలకం అత్యంత కీలకంగా మారింది. అమెరికాలో అణు ప్లాంట్ల నుంచి 19% విద్యుత్తును ఉత్పత్తి అవుతోంది. మిగిలిన దేశాలతో పోలిస్తే యురేనియం లభ్యత భారత్‌లో ఒక శాతమైనా లేదు. రాజస్థాన్‌, బిహార్‌, అసోం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో స్వల్పమొత్తంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×