E-Paper
Advertisement

హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ రెడ్ సిగ్నల్.. మళ్ళీ ఏమైంది? ఇజ్రాయెల్ కాల్పుల ఉల్లంఘన

హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ రెడ్ సిగ్నల్.. మళ్ళీ ఏమైంది? ఇజ్రాయెల్ కాల్పుల ఉల్లంఘన
Advertisement

Strait of Hormuz: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించిన 24 గంటలలోపు హోర్మూజ్ జలసంధిని మూసి వేసింది ఇరాన్. లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని టెహ్రాన్ ప్రధాన ఆరోపణ.

హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ రెడ్ సిగ్నల్

Advertisement

పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? హోర్మూజ్ జలసంధి ఎందుకు రెడ్ సిగ్నల్ పడింది? ఇరాన్-అమెరికా మధ్య జరిగే వరకు ఇలాంటి టెన్షన్లు తప్పవా? జలసంధిని మూసివేయడానికి ఇజ్రాయెల్ కారణమా? ముమ్మాటికీ అవుననే అంటోంది టెహ్రాన్. అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఇజ్రాయెల్ దూకుడు కంట్రోల్ చేసేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హోర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. ముఖ్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఆధీనంలోని ఉన్న న్యూస్ ఏజెన్సీ తెలిపింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడులలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

ఇజ్రాయెల్ కాల్పుల ఉల్లంఘన? కాల్పుల ఉల్లంఘనన్న ఇరాన్

దీనిపై ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. దీని కారణంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భావించింది. హోర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలను నిలిచి వేసింది. ఈ విషయం తెలియగానే అమెరికా రంగంలోకి దిగింది. జలసంధిని వెంటనే తిరిగి తెరవాలని వైట్ హౌస్ ఇరాన్‌ను డిమాండ్ చేసింది. ఇరాన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ముందు రెండు నౌకలను జలసంధి ద్వారా వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది.

లెబనాన్‌పై చేస్తున్న క్రూరమైన దురాక్రమణకు ప్రతిస్పందనగా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను తక్షణమే నిలిపి వేయాలని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ ప్రతినిధి ఇబ్రహీం ఎక్స్ లో రాసుకొచ్చారు. లెబనాన్ ప్రజలు మన కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారిని ఒక్క క్షణం ఒంటరిగా వదిలిపెట్టకూడదని అన్నారు. కాల్పుల విరమణ అన్ని విభాగాల్లో జరగాలన్నారు.

ALSO READ: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 10 నిమిషాల్లో 100 స్ట్రయిక్స్.. 89 మంది మృతి!

ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌ వేదికగా శాంతి చర్చలకు ముందు గురువారం లేదా శుక్రవారం నాటికి టెహ్రాన్ వెనక్కి తగ్గే అవకాశముందని అంటున్నారు. జలసంధి ద్వారా ప్రయాణించడానికి నౌకలకు ఇరాన్ అనుమతి అవసరం ఉందని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇరాన్ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని తేల్చేశారు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్‌ బలహీనపడిందని, ట్రంప్‌తో సంబంధాలు మాకు బలంగా ఉన్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడి సహకారం మరువలేనిదని అన్నారు.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×