BigTV English

Iran twin Bomb Blast | ఇరాన్‌లో బాంబు పేలుళ్లు.. 73 మంది మృతి

Iran twin Bomb Blast | ఇరాన్‌లో బాంబు పేలుళ్లు.. 73 మంది మృతి

Iran twin Bomb Blast | ఇరాన్ జెనెరల్ ఖాసిం సులేమానీ హత్య జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నాలుగవ వర్ధంతి కోసం జెనెరల్ ఖాసిం సమాధి వద్ద భారీగా జనం తరలివచ్చారు. అదే సమయంలో ఆ ప్రదేశంలో రెండు బాంబులు పేలి.. కనీసం 73 మంది చనిపోయినట్లు సమాచారం. మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


మరోవైపు ఇరాన్ అధికారిక మీడియా ప్రకారం.. దక్షిణ ఇరాన్‌ కర్మాన్ నగరంలోని ఒక మసీదు వద్ద జెనెరల్ ఖాసిం వర్ధంతి సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుండగా.. బాంబు పేలుళ్లు మరో ఘటన జరిగింది. ఈ పేలుళ్లలో ఇంతవరకూ ఎవరూ చనిపోలేదు కానీ 60 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ దాడులు ఉగ్రవాద సంస్థలు చేసినట్లు కర్మాన్ నగర డిప్యూటీ గవర్నర్ తెలిపారు.

జెనెరల్ ఖాసిం.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అగ్ర కమాండర్‌గా ఉన్నారు. ఆయన 2020 జనవరి 3 ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు వెళ్లినప్పుడు అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో జెనెరల్ ఖాసిం మరణించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామెనీ తరువాత జెనెరల్ ఖాసిం అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి.


జెనెరల్ ఖాసిం ఇరాన్ కుర్దుల బలగాలకు నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో కుర్దు సాయుధ బలగాలు రహస్య కార్యకలపాలు నిర్వహించేవి. పాలస్తీనాలోని హమాస్, లెబనాన్ హిజ్బుల్లా బలగాలకు కూడా ఆర్థిక సాయం, ఆయుధాల సరఫరా లాంటి కార్యకలాపాలు జెనెరల్ ఖాసిం అత్యంత రహస్యంగా నిర్వహించేవారు. 2020లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే జెనెరల్ ఖాసిం హత్యకు గురయ్యారు. ఈ విషయం ట్రంప్ అధికారికంగా ఆ సమయంలో ప్రకటించారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×