BigTV English

Israel A year of war: 365 రోజులు.. 26,000 రాకెట్లు.. 720 మంది దుర్మరణం.. ఐడీఎఫ్ కీలక డేటా రిలీజ్

Israel A year of war: 365 రోజులు.. 26,000 రాకెట్లు.. 720 మంది దుర్మరణం.. ఐడీఎఫ్ కీలక డేటా రిలీజ్

26,000 rockets fired at Israel in IDF data: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) కీలక డేటా విడుదల చేసింది. గాజా పట్టణంలో 17,000 మంది హమాస్ ఆపరేటివ్‌లను చంపారు. అలాగే అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో 1,000 మంది ఉగ్రవాదులను అంతం చేసినట్లు ప్రకటించింది.


అలాగే ఈ గ్రూపును పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇందులో 30 మంది హమాస్‌ బెటాలియన్‌, 165 మంది కంపెనీ కమాండర్లు ఉన్నారని తెలిపింది. 2023 అక్టోబరు 7న యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన రాకెట్ల సంఖ్య నుంచి దాని కార్యకలాపాలపై కొత్త డేటాను సోమవారం ప్రచురించింది.

గాజా ప్రాంతంలో 40,300 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపామని మొత్తం 4,700 సొరంగ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 8న లెబనాన్‌లోని హెజ్‌బొల్లా వారి మీద దాడులు ప్రారంభించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ఎదురు దాడుల్లో మొత్తం 800 మంది చనిపోయినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో 11,000 హెజ్‌బొల్లా స్థావరాలను పేల్చేసినట్లు నివేదికలో పేర్కొంది.


Also Read: మస్క్ మామ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ.4 వేలు ఇస్తాడట, చంపేద్దాం అనుకుంటున్నాడా?

అదే విధంగా ఈ ఏడాది కాలంలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌పై 26వేల రాకెట్లు, క్షిపణులు, డ్రోన్‌ల దాడులు జరిగాయి. ఇందులో గాజా నుంచి 13,200, లెబనాన్‌ నుంచి 12,400 దూసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే గాజాలో 41,000 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×