
Israel-Gaza War : హమాస్‌ను అంతం చేసే వరకు ఆగేది లేదంటున్న ఇజ్రాయెల్ ఆర్మీ.. గాజాలో ఒక్కొక్క ఏరియాను హస్తగతం చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అదే సమయంలో గాజాలోని దక్షిణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలందరు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని హెచ్చరించింది. వారి కోసం సేఫ్ పాసేజ్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను ఇప్పటికే చుట్టుముట్టిన ఇజ్రాయెల్ బలగాలు.. ఒక్కో ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఆసుపత్రి కిందే హమాస్ హెడ్ క్వార్టర్స్ ఉందని చెబుతోంది.
కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా.. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలను చూపిస్తోంది. ఆసుపత్రిలో టన్నెల్స్‌ను గుర్తించి ఒక్కొక్కటిగా ధ్వంసం చేసుకుంటూ వెళుతుంది ఇజ్రాయెల్ ఆర్మీ. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత హమాస్ ఉగ్రవాదులంతా ఈ ఆసుపత్రిలోకే వచ్చారని ఆధారాలను చూపిస్తోంది. ఇక గాజాలోని మసీదు, కిండర్ గార్డెన్ స్కూల్స్‌లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది ఇజ్రాయెల్.
మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. స్కూళ్లు, ఆసుపత్రులపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇజ్రాయెల్‌కు భయపడి కొన్ని దేశాలు మౌనం వహిస్తున్నాయని.. కానీ తాము నిజం వైపు ఉంటామంటూ పరోక్షంగా కొన్ని అరబ్ దేశాలకు ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
లెబనాన్ వైపు నుంచి ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. అయితే వీటిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని చెబుతుంది ఇజ్రాయెల్ ఆర్మీ. మరోవైపు ఇరాన్ మద్దతిస్తున్న మిలిషియా సంస్థలపై అమెరికా నిషేధం విధించింది.
ఇజ్రాయెల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాలోని పలు ప్రాంతాల్లో ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అనుమతులిచ్చింది. అంతేగాకుండా ఇజ్రాయెల్‌కు 60 వేల లీటర్ల ఇంధనం సరఫరా చేసేందుకు కూడా అనుమతిచ్చింది. వెంటనే రెండు ట్యాంకుల్లో ఇంధనాన్ని గాజాకు సరఫరా చేశారు.
Nara Bhuvaneshwari : టీడీపీ కార్యకర్తలకు నోటీసులు.. వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి ఆగ్రహం..