BigTV English

Israel-Hamas War : హమాస్ మారణకాండకు నిలువుటద్దంలా నిలిచే వీడియో.. నెట్టింట వైరల్

Israel-Hamas War : హమాస్ మారణకాండకు నిలువుటద్దంలా నిలిచే వీడియో.. నెట్టింట వైరల్

Israel-Hamas War : ఇజ్రాయెల్ లో అక్టోబర్ 7న జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో హమాస్ యోధులు మారణకాండ సృష్టించారన్న వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో హమాస్ చేసిన నరమేధం.. స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. సుమారు 3500 మంది యువత సూపర్నోవా సంగీత కార్యక్రమానికి హాజరై.. అక్కడ ఆటపాటల్లో మునిగితేలుతుండగా.. గాజా సరిహద్దు కంచెను తెంచుకుని వచ్చిన పాలస్తీనా ముష్కరులు వారిపై కాల్పులు జరిపి హతమార్చారు.


ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే.. అమాయక ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు.సుక్కోట్ ను జరుపుకునేందుకు వచ్చిన యువ ఇజ్రాయెలీలపై డజన్లకొద్దీ హమాస్ యోధులు ఇష్టారీతిన కాల్పులు జరపడంతో.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రక్తపు మడుగుల్లో యువత, పిల్లలు పడి ఉన్న ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గాజాను దక్షిణ ఇజ్రాయెల్ నుండి వేరుచేసే గోడ నుండి దాదాపు 3.3 మైళ్లు (5.3 కిలోమీటర్లు) రేయిమ్ కిబ్బట్జ్ వెలుపల ఉన్న మురికి మైదానంలో ఈ పార్టీ జరిగింది.

ఈ దాడుల్లో సుమారు 260 మంది చనిపోగా..వారిలో అత్యధికశాతం మంది అమ్మాయిలే ఉన్నారు. పార్టీ కావడంతో.. వారికి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. పలువురు ప్రాణాలు అరచేతపట్టి పారిపోయారు. ఇప్పటికీ అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరి ఆచూకీ తెలియరాలేదు. అక్కడి నుంచి బయటపడిన కొందరు.. తమ అనుభవాలను పంచుకున్నారు. హమాస్ యోధులు తమను అసలు మనుషులుగానే చూడలేదని వాపోయారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. హమాస్ కాల్పుల ధాటికి అక్కడికక్కడే మరణించిన వారి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. హమాస్ సృష్టించిన మారణకాండకు ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తోంది.


https://twitter.com/BefittingFacts/status/1720635563823214607?t=ipcl4UE-ORSnt3xa_3TOLg&s=08

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×