BigTV English

Israel Target: ఇజ్రాయెల్ హిట్‌లిస్ట్.. నెక్ట్స్ టార్గెట్ వారే!

Israel Target: ఇజ్రాయెల్ హిట్‌లిస్ట్.. నెక్ట్స్ టార్గెట్ వారే!

Israel Target: హమాస్ మిలిటెంట్లు, కీలక నేతల ఏరివేత విషయంలో తగ్గేదే లే అన్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎంతో దూకుడుగా ఉంది. తాజాగా ఐడీఎఫ్ దాడుల్లో పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు, హమాస్ పొలిట్‌బ్యూరో‌లో తొలి మహిళ సభ్యురాలైన జమీలా అబ్దుల్లా తహా అల్-శాంతి(68) మరణించింది. హమాస్ సహ వ్యవస్థాపకుడు అబ్దెల్ అజీజ్ అల్-రాంతీజితో ఆమె వివాహమైంది.


2004లో ఇజ్రాయెల్ మిస్సైల్ దాడిలో అబ్దెల్ అజీజ్ మృతి చెందాడు. జమీలా మరణంతో హమాస్ ఇప్పటివరకు కోల్పోయిన కీలక నేతల సంఖ్య 9కి చేరింది. ఇక హమాస్‌లో నంబర్-2, అగ్రనేత అయిన యాహ్యా సిన్‌వార్ కోసం ఇజ్రాయెల్ జల్లెడ పడుతోంది. హమాస్ గాజా హెడ్‌గా ఇజ్రాయెల్ నగరాలపై జరిపిన దాడుల్లో అతడే కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐడీఎఫ్ తదుపరి టార్గెట్‌ అతనే అయినా.. మరి కొందరు ముఖ్యులు కూడా హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. వారెవరో చూద్దాం.

ఇస్మాయిల్ హనియో: పాలస్తీనాలో ప్రముఖ రాజకీయ నేత. గాజా సిటీలోని అల్-షతి శరణార్థి శిబిరంలో 1963, జనవరి 29న జన్మించాడు. హమాస్ సీనియర్ నాయకుడే కాదు.. పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఆ మిలిటెంట్ గ్రూప్‌లో కీలక వ్యక్తి. కొద్ది రోజుల క్రితం గాజా సిటీపై ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడుల్లో అతని కుటుంబసభ్యులు 14 మంది మరణించారు.


మహ్మద్ డయీఫ్: హమాస్ సీనియర్ నేత. హమాస్ మిలటరీ నేతగా, ఆ సంస్థ సాయుధ విభాగం ఇజ్ అద్దిన్ అల్-ఖస్సం బ్రిగేడ్స్‌లో కీలక వ్యక్తిగా పేరుంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యూహాలు రచించడంలో, సైనిక వ్యవహారాలు నడపడంలో అతనిదే ప్రముఖ పాత్ర. ఇజ్రాయెల్ బలగాలకు చిక్కినట్టే చిక్కి పలు మార్లు తప్పించుకున్నాడు.

మార్వాన్ ఇస్సా: మహ్మద్ డయీఫ్‌కు కుడిభుజం. హమాస్ సీనియర్ సభ్యుల్లో ఒకడు. మిలటరీ వింగ్ లో ప్రముఖ పాత్ర పోషించేది అతనే. అల్-ఖస్సం బ్రిగేడ్స్‌కు డిప్యూటీ కమాండర్‌గా మార్వాన్ ఇస్సాను అందరూ భావిస్తుంటారు. సైనిక వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరుంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్లు ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంటాడు.

అబ్దుల్లా బర్గౌటి: పాలస్తీనా మిలిటెంట్‌గా హమాస్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. వెస్ట్ బ్యాంక్‌లో జన్మించిన అబ్దుల్లా బాంబుల తయారీలో నిపుణుడు. హమాస్‌కు బాంబులు తయారు చేసి ఇస్తుంటాడు. పలు ఉగ్రదాడుల కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు. హమాస్ బాంబ్ మేకర్ అని పిలుస్తుంటారు. అబ్దుల్లాను ప్రిన్స్ ఆఫ్ షాడో అని కూడా వ్యవహరిస్తుంటారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×