BigTV English

Japanese Satellite Explosion: ప్రయోగించిన కొన్ని సెకన్లలో పేలిన జపాన్ ఉపగ్రహం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Japanese Satellite Explosion: ప్రయోగించిన కొన్ని సెకన్లలో పేలిన జపాన్ ఉపగ్రహం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Japanese Satellite Explosion
Japanese Satellite Explosion

Japanese Satellite Explosion(News update today in telugu): జపనీస్ కంపెనీ తయారు చేసిన రాకెట్ ప్రయోడగించిన కొన్ని సెకన్లలోపే పేలింది. ఈ ఘటన ఇవ్వాళ చోటు చేసుకుంది.


టోక్యోకు చెందిన స్టార్టప్ స్పేస్ వన్ విజయవంతంగా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి జపాన్ ప్రైవేట్ సంస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

18-మీటర్ల (60-అడుగులు) సాలిడ్ ఫ్యూయెల్ కైరోస్ రాకెట్ పశ్చిమ జపాన్‌లోని వాకయామా ప్రిఫెక్చర్‌లోని స్టార్టప్ స్వంత లాంచ్ ప్యాడ్ నుంచి చిన్న ప్రభుత్వ పరీక్షా ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. కానీ ప్రయోగించిన కొన్ని సెకన్ల తర్వాత, ఒక నిప్పు కణంలా మారి పేలిపోయింది. దీంతో లాంచ్ ప్యాడ్ మొత్తం పొగతో నిండిపోయింది.


వెంటనే సిబ్బంది స్ప్రింక్లర్లతో నీటిని చల్లడం ప్రారంభించారు. అదే సమయంలో మండుతున్న శిధిలాలు చుట్టుపక్కల కొండలపై పడటం కనిపించింది.

ఈ వైఫల్యం లాభదాయకమైన ఉపగ్రహ-ప్రయోగ మార్కెట్లోకి ప్రవేశించడానికి జపాన్ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బ తీసింది.

ప్రయోగించిన 51 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని భావించారు. కానీ ప్రయోగించిన కొన్ని సెకన్లలోపే పేలిపోవడం గమనార్హం.

Also Read: హైతీ ప్రధాని రాజీనామా.. కారణం ఇదే!

Canon Electronics, IHI ఏరోస్పేస్, నిర్మాణ సంస్థ Shimizu, జపాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో సహా ప్రధాన జపనీస్ టెక్ వ్యాపారాల బృందం 2018లో స్పేస్ వన్‌ని స్థాపించింది.

గత జూలైలో మరో జపనీస్ రాకెట్ పరీక్షలో ఇంజన్ ఆన్ చేసిన 50 సెకన్ల తర్వాత పేలింది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×