BigTV English

Jeff Bezos Warning : టీవీ, ఫ్రీడ్జ్, కారు కొనడంకంటే..నగదు నిల్వ చేసుకోండి : జెఫ్ బెజోస్

Jeff Bezos Warning : టీవీ, ఫ్రీడ్జ్, కారు కొనడంకంటే..నగదు నిల్వ చేసుకోండి : జెఫ్ బెజోస్
Jeff Bezos Warning : అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆర్ధిక మాంద్య మనల్ని ముంచెత్తనుంది.. కాబట్టి టీవీ, ఫ్రిజ్, కారు లాంటివి ఏవైనా కొనాలనుకుంటే వాయిదా వేసుకోమన్నారు. దానికి బదులుగా నగదును నిల్వచేసుకోమని సలహా ఇచ్చారు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఫ్ బెజోస్ ఈ వ్యాఖ్యలు చేసారు.

ప్రపంచంలో ఆర్ధిక మాంద్యం ఖచ్చితంగా ముంచుకురానున్నట్లు ఆయన పరోక్షంగా సంకేతాన్ని ఇచ్చినట్లయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు మొదలైంది. ట్విట్టర్ ఇప్పటికే 4వేల 500 మందిని ఇంటిని పంపించింది. మెటా సంస్థ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టింది. అమెజాన్‌లో 10వేల మందిని తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే బెజోస్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


చిన్న వ్యాపారస్తులను భారీ పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గమన్నారు జెఫ్ బెజోస్. నగదు నిల్వల పైనే దృష్టి కేంద్రీకరించమని సూచించారు. ఇటీవల జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాల్గవ అత్యంత ధనవంతుడి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. బెజోస్ సంపద రూ.10 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఆయనే ఫ్రిజ్, కారు, టీవీ కొనడంలో జాగ్రత్త వహించాలని చెప్పడంతో కొందరిలో ఆర్ధికమాంద్యం భయం స్టార్ట్ అయింది.


Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×