BigTV English

Jeffrey Epstein | సెక్స్ స్కాండల్‌లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు.. చిన్న పిల్లలతో స్టీఫెన్ హాకింగ్ కూడా..

Jeffrey Epstein | అమెరికాలోని న్యూయార్క్ కోర్టు బుధవారం సెక్స్ ట్రాఫిక్ంగ్ నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ లోని సమాచారం బహిర్గతం చేశారు. ఇందులో అమెరికా, బ్రిటన్‌కు సంబంధించిన ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ ప్రముఖులంతా తక్కువ వయసు అమ్మాయిలు, అబ్బాయిలతో సెక్స్ చేసేవారని ఈ ఫైల్స్‌లో ఉంది.

Jeffrey Epstein | సెక్స్ స్కాండల్‌లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు.. చిన్న పిల్లలతో స్టీఫెన్ హాకింగ్ కూడా..

Jeffrey Epstein | అమెరికాలోని న్యూయార్క్ కోర్టు బుధవారం సెక్స్ ట్రాఫిక్ంగ్ నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ లోని సమాచారం బహిర్గతం చేశారు. ఇందులో అమెరికా, బ్రిటన్‌కు సంబంధించిన ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ ప్రముఖులంతా తక్కువ వయసు అమ్మాయిలు, అబ్బాయిలతో సెక్స్ చేసేవారని ఈ ఫైల్స్‌లో ఉంది.


ఫైల్స్‌లో అమెరికా మాజీ ప్రెసిడెంట్లు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, దివంగత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ ఆండ్రూ, దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్, అమెరికా సూపర్ మోడల్ నయోమీ క్యాంప్ బెల్ పేర్లు బయటపడ్డాయి. వీరందరి కామ వాంఛలు తీర్చడానికి జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే ఏజెంట్ అమ్మాయిలు, చిన్న పిల్లలను సరఫరా చేసేవాడని ‘వర్జినీయా గుఫ్రె’ అనే సామాజిక కార్యకర్త కోర్టులో కేసు వేసింది.

జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక సెలెబ్రిటీ ఏజెంట్, అతిపెద్ద ఫైనాన్షియర్. అతను తన కస్టమర్లైన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిలియనీర్ల కోసం చట్ట వ్యతిరేకంగా చిన్నపిల్లలను వ్యభిచార వృత్తిలో లాగాడని.. వర్జినీయా గుఫ్రె వాదించింది. గుఫ్రెను కూడా జెఫ్రీ ఎప్‌స్టీన్ చేసిన నేరాలలో బాధితురాలు. ఎప్‌స్టీన్ 14 ఏళ్ల బాలికలను ఒక ప్రైవేట్ ఐలాండ్(సముద్ర దీవి)కి తీసుకెళ్లి వారిని హింసించేవాడని వర్జినియా గుఫ్రె తెలిపింది. అలాగే శాస్త్రవేత్ స్టీఫెన్ హాకింగ్ చిన్నపిల్లలతో గ్రూప్ సెక్స్ చేసేవాడని, మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కేవలం యంగ్ అమ్మాయిలు మాత్రమే కావాలని డిమాండ్ చేసేవాడని ఈ ఫైల్స్‌లో ఉంది.


అయితే 2019లో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఈ కేసు విచారణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా అతని కేసుకు సంబంధించిన రహస్య ఫైల్స్‌ లోని సమాచారాన్ని న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి బహిర్గతం చేశారు.

ఈ ఫైల్స్‌లో హాలివుడ్ పాపులర్ నటులు కూడా ఉన్నారు. టైటానిక్ హీరో లియోనార్డో డైకాప్రియో, బ్రూస్ విల్లీస్, కెవిన్ స్పేసీ, ప్రముఖ సినీ నిర్మాత జార్జి లుకాస్, సినీ నటి కెమరాన్ డియాజ్ పేర్లు ఈ జాబితాలో ఉండడంతో ఈ కేసు సంచలనంగా మారింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×