BigTV English

Protests in Kenya : చిచ్చురేపిన కొత్త ఆర్థిక బిల్లు.. కెన్యా పార్లమెంటు భవనానికి నిప్పు..!

Protests in Kenya : చిచ్చురేపిన  కొత్త ఆర్థిక బిల్లు.. కెన్యా పార్లమెంటు భవనానికి నిప్పు..!

Kenya’s Parliament Set on fire after Protests Against Controversial Tax: కెన్యా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్థిక బిల్లు ఆ దేశంలో అల్లర్లు చెలరేగడానికి కారణమైంది. ఈ ఆర్థిక బిల్లు ద్వారా భారీగా పన్నులు పెంచారంటూ ఆందోళనకారులు కెన్యా పార్లమెంటును ముట్టడించి నిప్పుపెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాదళాలు కాల్పులు జరపడంతో ఐదుగురు ఆందోళనకారులు మరణించగా 150 మందికిపైగా గాయపడ్డారు.


కొత్త పన్నులను తక్షణం రద్దు చేయాలని ఆందోళనకారులు మంగళవారం పెద్దెత్తున నైరోబీలోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి ఆమా ఒబామా కూడా పాల్గొన్నారు. పోలీసులు తొలుత టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోగా పార్లమెంటు భవనానికి నిప్పుపెట్టారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.

Also Read: లిబరల్ పార్టీకి బిగ్ షాక్.. ఉపఎన్నికల్లో ఓటమి..ట్రూడోపై పెరిగిన ఒత్తిడి!


కెన్యా ప్రభుత్వం బలవంతంగా తెచ్చిన కొత్త ఆర్థిక బిల్లు ప్రజా వ్యతిరేకమని నిరసనలో పాల్గొన్న ఆమా ఒబామా పేర్కొన్నారు. కొత్తగా విధించిన పన్నులను రద్దుచేయాలని నిరసన తెలపడం ప్రజల హక్కని, వారిపై కాల్పులకు తెగబడడం దారుణమని ఆమె అన్నారు. తామంతా టియర్ గ్యాస్ కారణంగా చాలా ఇబ్బంది పడ్డామని, ఇంతలోనే కాల్పులు జరిపారని ఆమె తెలిపారు. మంగళవారం సిఎన్‌ఎన్‌కి ఇచ్చిన ప్రత్యక ఇంటర్వ్యూలో దేశ వివాదాస్పద ఆర్థిక బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఆమె కంటతడి పెట్టారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×