BigTV English
Advertisement

Canada President Trudeau: లిబరల్ పార్టీకి బిగ్ షాక్.. ఉపఎన్నికల్లో ఓటమి.. ట్రూడోపై పెరిగిన ఒత్తిడి..!

Canada President Trudeau: లిబరల్ పార్టీకి బిగ్ షాక్.. ఉపఎన్నికల్లో ఓటమి.. ట్రూడోపై పెరిగిన ఒత్తిడి..!

Canada President Trudeau: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వచ్చే ఏడాది కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరునంలో ఆ పార్టీ కంచుకోటకు బీటలు పడ్డాయి. గత మూడు దశాబ్దాలుగా లిబరల్ పార్టీకి కంచుకోటగా ఉన్న ‘టొరంటో-సెయింట్ పాల్స్’ పార్లమెంట్ స్థానంలో ఓటమి చవిచూసింది.


‘టొరంటో-సెయింట్‌ పాల్స్‌’ పార్లమెంట్ స్థానానికి ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో లిబరల్ పార్టీ అభ్యర్థిపై విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవార్ట్ విజయం సాధించారు. తాజాగా, వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో లిబరల్ పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో 500 ఓట్ల కంటే ఎక్కువ తేడాతో గెలుపొందారు.

1993 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అధికార లిబర్ పార్టీ ఓటమి చెందింది. 1993లో మొదటిసారిగా ఈ స్థానంలో ఓటమి చెందిన లిబరల్ పార్టీ.. మూడు దశాబ్ధాల తర్వాత ఓటమి చవిచూడడంతో ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Also Read: Trump-Biden debate: నేడే ట్రంప్, బైడెన్ బిగ్ డిబేట్..నాలుగేళ్లలో తొలిసారి!

అదే విధంగా, ఈ ఉప ఎన్నికల్లో న్యూ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్ పర్హార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ప్రజలు ఇచ్చిన తీ తీర్పు అధికార పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధికార పార్టీ.. ఓడిపోవడం ఆ పార్టీకి షాక్ ట్రీట్ మెంట్ వంటిదేనని కెనడా మీడియా సంస్థలు వ్యాఖ్యనిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి ఓడిపోవడంతో తక్షణమే పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అధినేత పియర్ పొయిలీవ్ర డిమాండ్ చేశారు.

Also Read: Nepal Rains: నేపాల్‌పై ప్రకృతి కన్నెర.. భారీ వరదలకు 20 మంది మృతి!

కాగా, ఇటీవల జరిగిన జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాన, ట్రూడో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత వంటి విషయాల్లో భారత్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉందని ట్రూడో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×