Big Stories

Kim Jong UN | మహిళల ముందు కన్నీరు పెట్టిన ఉత్తర కొరియా నియంత

Kim Jong UN | ఒక నియంత ఒక కఠినాత్ముడు అని పేరున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మహిళల ముందు కన్నీరు పెట్టారు. ఇది చూసి అందరూ ఆశర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విషయమేమిటంటే.. మహిళలకు సంబంధించి ఒక కార్యక్రమంలో కిమ్ జాంగ్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది పిల్లలని కనాలని.. దేశ జనాభా పెంచాలని మహిళలకు విజ్ఞప్తి చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

- Advertisement -

తాను దేశ కోసం పనిచేస్తున్నానని.. ఎలాంటి కష్టమొచ్చినా ఒక కుటుంబంలో మహిళలు, తల్లులు ఎన్ని కష్టాలు పడి పిల్లలను పోషిస్తారో గుర్తుచేసుకుంటానని వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో మహిళల పాత్ర.. ముఖ్యంగా కుటుంబ బాధ్యత మోసే మహిళల బాధ్యత ఎనలేనిదని ఆయన ప్రశంసించారు. పిల్లలకు మంచి చదువు, మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మనందరిదీ అని ఆయన చెప్పారు.

- Advertisement -

ఉత్తర కొరియా జనాభా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో కిమ్ ప్రభుత్వం జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే దేశంలో యువత సంఖ్య తగ్గిపోతోందని, సాధ్యమైనంత వరకు ఎక్కువ పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకే ప్రతి కుటుంబం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలని కనాలని ఆయన అన్నారు. పెద్ద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలుంటాయని ఆయన ప్రకటించారు.

జనాభా తగ్గిపోవాడానికి కారణం.. 1970-80 దశకం నుంచి ఉత్తర కొరియా ప్రభుత్వ జనాభా నియంత్రిచాలని కఠిన చట్టాలు తీసుకొచ్చింది. గర్భ నిరోధక విధానాలు, కుటుంబంలో ఇద్దరు సంతానమ మాత్రమే ఉండాలనే చట్టాలు తీసుకొచ్చింది. దీనికి తోడు 1990లో కొరియాలో భయంకరమైన కరువు. ఆ సమయంలో లక్షల సంఖ్యలో మనుషులు చనిపోయారు.

ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. 2023 సంవత్సరంలో ఉత్తర కొరియాలో సగటున ఒక మహిళ 1.8 పిల్లలను జన్మనిస్తోంది. ఈ సమస్య పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశంలో ఇంకా తీవ్రంగా ఉంది. దక్షిణ కొరియాలో ఒక మహిళ 0.78 పిల్లలను మాత్రమే జన్మనిస్తోంది. అదే జపాన్‌లో ఈ సంఖ్య 1.26 ఉంది.

ఇటీవలే రష్యా ప్రధాన మంత్రి కూడా మహిళలకు 8 మంది పిల్లలను కనాలని ఒక కార్యక్రమంలో చెప్పారు. ఈ సమస్య ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతం ఇటలీ దేశంలో ఎక్కువగా ఉంది. అక్కడ గత మూడు నెల్లల్లో ఒక బిడ్డ కూడా పుట్టలేదు. ప్రపంచంలో పిల్లలు కనడానికి ఇష్టపడని వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. పిల్లలు కంటే వారి బాధ్యత వహించడానికి వారు ఇష్టపడడం లేదు. పైగా జపాన్‌లో యువత జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. జీవితాన్ని వివాహ బంధంలో పెట్టడాడినికి వారు విముఖంగా ఉన్నారు. ఈ పరిస్థితులు ఆయా దేశాల్లో జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టేందుకు కారణమవుతున్నాయి. దీంతో ఆ దేశాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News