Terrorist Saifullah Khalid: లష్కరే తొయిబా టాప్ మోస్ట్ ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లోని సింద్ ఫ్రావిన్స్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్‌ను దారుణంగా కాల్చి చంపారు. ప్రస్తుతం లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి ఖలీద్ పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
చాలా రోజుల నుంచి ఫేక్ ఐడీ క్రియేట్ చేసుకుని నేపాల్ దేశంలో తలదాచుకున్న సైఫుల్లా ఖలీద్.. ఇటీవలే పాకిస్థాన్ లోని సింద్ ప్రావిన్స్ కు మకాం మార్చాడు. అయితే కాసేపటి క్రితమే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ కాల్చి పరారయ్యారు. నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులను నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
2006లో నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్రం కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సైఫుల్లా ఖలీద్ హస్తం ఉంది. 2005 లో జరిగిన ఐఐఎస్సీ క్యాంపస్ దాడిలో కూడా ఖలీద్ హస్తం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2001లో జరిగిన రాపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడి ఘటనలో సైఫుల్లా ఖలీద్ నిందితుడిగా ఉన్నట్టు చెప్పారు.
Also Read: Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఈసారి ఏకంగా 53 మంది..?
గత కొన్ని సంవత్సరాల నుంచి నేపాల్‌లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన సైఫుల్లా ఖలీద్.. ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఆర్మీ మరో వీడియో రిలీజ్.. ఈసారి తగ్గేదేలే