Fire Accident: హైదరాబాద్‌లోని ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ప్రమాద ఘటన జరిగిన రొపకపి గంటల్లోనే హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది. మైలార్ దేవ్ పల్లి మూడంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో వారిని రక్షించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రమాద సమయంలో భవనంలో 53 మంది ఉన్నట్టు సమాచారం. బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లే మార్గం వద్దే ప్రమాదం జరిగింది. దీంతో బాధితులు బయటకు వచ్చేందుకు.. టెర్రస్ పైకి ఎక్కి ఆందోళన వ్యక్తం చేశారు. చుట్టు పక్కల ఉన్న స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. సమయానికి ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 53 మందిని కాపాడారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఆర్మీ మరో వీడియో రిలీజ్.. ఈసారి తగ్గేదేలే